తీపనుచు చేఁదు తెగఁదిని వెనకఁ బడరాని

॥పల్లవి॥
తీపనుచు చేఁదు తెగఁదిని వెనకఁ బడరాని
ఆపదలచేతఁ బొరలాడేముగాన
॥చ1॥
అప్పుదీరినదాఁకా నలవోకకైనవా-
రెప్పుడునుఁ దమవార లేలౌదురు
అప్పటప్పటికిఁ బ్రియ మనుభవింపుచు మమత
చెప్పినటువలెఁ దాము సేయవలెఁ గాక
॥చ2॥
పొందైనవారమని పొద్దు వోకకుఁ దిరుగు-
యిందరునుఁ దమవార లేలౌదురు
కందువగు తమకార్యగతులు దీరినదాఁక
సందడింపుచుఁ బ్రియము జరపవలెఁ గాక
॥చ3॥
తెగని కర్మముదమ్ముఁ దిప్పుకొని తిరిగాడ
ఆగడుకోరిచి పెక్కులాడ నేమిటికి
తగవేంకటేశ్వరునిఁ దలఁచి యిన్నిటాఁ దాము
విగతభయులయి భ్రాంతి విడువవలెఁ గాక
రాగము: బౌళి
రేకు: 0006-04
సంపుటము: 1-39

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, బౌళి

చదవండి :  తానే తెలియవలె తలఁచి దేహి తన్ను

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *