ఇప్పుడిటు కలగంటి నెల్ల లోకములకు-

॥పల్లవి॥
ఇప్పుడిటు కలగంటి నెల్ల లోకములకు-
నప్పఁడగు తిరువేంకటాద్రీశుఁ గంటి
lisinopril and driving
lisinopriland.net
lisinopril and driving
read
॥చ1॥
అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి
ప్రతిలేని గోపురప్రభలు గంటి
శతకోటి సూర్యతేజములు వెలుఁగఁగఁ గంటి
చతురాస్యుఁ బొడగంటి చయ్యన మేలుకంటి
॥చ2॥
కనకరత్నకవాటకాంతు లిరుగడఁగంటి
ఘనమైన దీపసంఘములు గంటి
అనుపమమణిమయమగు కిరీటము గంటి
కనకాంబరము గంటి గక్కన మేలుకంటి
॥చ3॥
అరుదైన శంఖచక్రాదులిరుగడఁ గంటి
సరిలేని అభయహస్తము గంటిని
తిరు వేంకటాచలాధిపునిఁ జూడఁగఁ గంటి
హరిఁ గంటి గురుఁ గంటి నంతట మేలుకంటి
రాగము: భూసాళం
రేకు: 0006-03
సంపుటము: 1-38

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, భూసాళం

చదవండి :  తిరువీధుల మెరసీ దేవదేవుడు - అన్నమాచార్య సంకీర్తన

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *