ఏ నిన్ను దూరక నెవ్వరి దూరుదు నీ-
॥పల్లవి॥ ఏ నిన్ను దూరక నెవ్వరి దూరుదు నీ- వాని నన్నొకయింత వదలక నను నేలవలదా read ॥చ1॥ అపరాధిఁగనక నన్నరసి కావుమని అపరిమితపుభయ మంది నీకు శరణంటిఁగాక నెపములేక నన్ను నీకుఁ గావఁగ నేల అపవర్గరూప దయాంబుధి తిరువేంకటాధిపా ॥చ2॥ ఘనపాపిఁ గనక నీకరుణ గోరి నీ- వనవరతము నాయాతుమ విహరించుమంటిఁ గాక యెనసి నన్నుఁ గాచు టేమి యరుదు నీకు- ననఘుఁడ పరమతత్త్వానంద తిరువేంకటాధిప |
రాగము: సామంతం రేకు: 0005-06 సంపుటము: 1-35 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతం