పెంచఁబెంచ మీఁదఁ బెరిగేటిచెలిమి
॥పల్లవి॥ పెంచఁబెంచ మీఁదఁ బెరిగేటిచెలిమి ఇంచుకంత తాలిముల కెడలేనిచెలిమి lisinopril and driving lisinopril and driving lisinopril and driving ॥చ1॥ అంటుముట్టులేక మనసులంటుకొన్న చెలిమి కంటఁగంట నవ్వించేఘనమైనచెలిమి వెంటవెంటఁ దిరిగాడు వెఱ్ఱిగొన్న చెలిమి యింటివారిచిత్తములకు నెడరైనచెలిమి ॥చ2॥ చెక్కుచెమట పెక్కు వలనే చిక్కనై నచెలిమి యెక్కడౌటా తమ్ముఁదమ్ము నెఱఁగనీనిచెలిమి చక్కఁదనమే చిక్క మేనుచిక్కినట్టిచెలిమి లెక్కలేని యాసలెల్ల లేఁతలయినచెలిమి ॥చ3॥ అంకురించినట్టితలఁపు లధికమయినచెలిమి లంకెలయినయాసలెల్లా లావుకొన్న చెలిమి వేంకటాద్రివిభునిఁ గూడి వేడుకయినచెలిమి పంకజాననలకెల్లఁ బాయరానిచెలిమి |
రాగము: ఆహిరి రేకు: 0005-01 సంపుటము: 1-29 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ఆహిరి