
చిత్తములో నిన్నుఁ జింతించనేరక
॥పల్లవి॥ చిత్తములో నిన్నుఁ జింతించనేరక మత్తుఁడఁనై పులుమానిసినైతి ॥చ1॥ అరుత లింగము గట్టి యది నమ్మఁజాలక పరువతమేఁగిన బత్తుడఁ నైతి సరుస మేఁకపిల్లఁ జంకఁబెట్టుక నూఁత- నరయు గొల్లనిరీతి నజ్ఞాని నైతి ॥చ2॥ ముడుపు కొంగునఁగట్టి మూలమూలలవెదకే- వెడమతినై నే వెర్తుడ నైతి విడువ కిక్కడ శ్రీవేంకటేశ్వరుఁ డుండ పొడగానక మందబుద్ధి నేనైతి |
రాగము: ముఖారి రేకు: 0003-06 సంపుటము: 1-19 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ముఖారి