దిబ్బలు వెట్టుచుఁ దేలిన దిదివో

॥పల్లవి॥
దిబ్బలు వెట్టుచుఁ దేలిన దిదివో
ఉబ్బు నీటిపై నొక హంసా
lisinopril and driving
lisinopril and driving
lisinopril and driving
arcoxia
॥చ1॥
అనువునఁ గమలవిహారమై నెలవై
వొనరి వున్నదిదె వొక హంసా
మనియెడి జీవుల మానససరసుల-
వునికి నున్న దిదె వొక హంసా
॥చ2॥
పాలునీరు నేర్పరిచి పాలలో-
నోలనాడె నిదె వొక హంసా
పాలుపడిన యీ పరమహంసముల-
వోలి నున్నదిదె వొక హంసా
॥చ3॥
తడవి రోమరంధ్రంబుల గుడ్ల-
నుడుగక పొదిగీ నొక హంసా
కడువేడుక వేంకటగిరి మీఁదట-
నొడలు వెంచెనిదె యొక హంసా
రాగము: కాంబోధి
రేకు: 0003-03
సంపుటము: 1-16

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, కాంబోధి

చదవండి :  కాకున్న సంసారగతులేల - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: