సిద్దవటం మండలం మాచుపల్లె గ్రామంలో పవిత్ర పెన్నానది ఒడ్డున వెలసిన శ్రీ శ్రీ జగజ్జనని రేణుకా యల్లమాంబ వార్షిక తిరుణాల మహోత్సవాలు వైశాఖ మాసం బహుళ పాడ్యమి నాడు ( మే 5వ తేది ) ధ్వజారోహాణ, అంకురార్పణ కార్యక్రమమలతో సొమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వైశాఖ మాసం బహుళ తదియ రోజున ( మే 6 వ తేదీన ) అమ్మవారి వూరేగింపు, పాట కచేరి జరిగాయి. ( 9 వతేదీ ) అమ్మవారి కళ్యాణం, ఏనుగు వాహనం పై వూరేగింపు,
సిం హ వాహనం పై వైభవంగా అమ్మవారి ఊరేగింపు అమ్మవారి కథా కాలక్షేపం, పాట కచేరి జరుగుతాయి.
వైశాఖ మాసం బహుళ పంచమిని పురష్కరించుకుని మే నెల 10 వ తేదీ గురువారం అమ్మవారికి బోనాలు, మొక్కుబడులు చెల్లిస్తారు. ఎద్దులచే బండలాగుడు పోటీ జరుగుతుంది. చెక్క భజనలు, పండరి భజనలు, వినోద కార్యక్రమాలు జరుగుతాయని గ్రామ పెద్దలు తెలిపారు.
శూక్రవారం కూడా అమ్మవారి వూరేగింపు, ఎద్దులచే బండలాగుడు పోటీలు జరుగుతాయి.