884.80 అడుగులు చేరిన శ్రీశైలం నీటిమట్టం

    884.80 అడుగులు చేరిన శ్రీశైలం నీటిమట్టం

    శ్రీశైలం డ్యాం నీటిమట్టం శుక్రవారం 884.80 అడుగులు చేరింది. దీంతో జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం 214.8450 టీఏంసీలుగా నమోదయింది. ఎగువ పరివాహకం నుంచి జలాశయానికి వరదనీటి ప్రవాహం స్వల్పంగా పెరిగింది. రాత్రి 8 గంటల సమయానికి జూరాల నుం చి 54,658 క్యూసెక్కులు, రోజా నుం చి 43,300 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి చేరుతోంది.

    ఈ క్రమంలో ఆ సమయానికి కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఒక్కో యూనిట్‌ను 92.4 మెగావాట్ల సామర్థ్యంతో ఏడు యూనిట్లను రన్ చేస్తూ విద్యుదుత్పత్తి ద్వారా 31,714 క్యూసెక్కుల నీటిని, అలాగే ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేం ద్రంలో ఒక్కో యూనిట్‌ను 150 మెగావాట్ల సామర్థ్యంతో ఆరు యూనిట్లను రన్ చేస్తూ విద్యుదుత్పాదన ద్వారా 44,497 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

    చదవండి :  జిల్లాలో బస్సు సర్వీసుల నిలిపివేత

    మరోవైపు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 15 వేల క్యూసెక్కుల నీటిని, హంద్రి-నీవా ద్వారా 700 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాం తాలకు తాగు, సాగునీటి కోసం వదులుతున్నారు. కాగా గడిచిన 24 గంట ల్లో రెండు విద్యుత్ కేంద్రాల ద్వారా 33.407 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అందించారు. ఇందుకు జలాశయం నుంచి 71,853 క్యూసెక్కుల నీటిని వినియోగించారు.

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *