సివిల్స్‌లో సత్తా చాటిన కడపజిల్లా యువకులు

    కడప : జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు సివిల్ సర్వీస్ ఎంపిక ఫలితాల్లో తమ సత్తా చాటారు. వీరు జాతీయస్థాయి సివిల్ సర్వీస్ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించి మెరిశారు. జిల్లాకు చెందిన అన్నం మల్లికార్జునయాదవ్ 20వ ర్యాంకును, ఎంసీవీ మహేశ్వరరెడ్డి 196వ ర్యాంకు సాధించారు. వీరివురు వైద్యవృత్తి ద్వారా సేవ చేస్తూ సివిల్ సర్వీసును ఎంచుకోవడం విశేషం. వీరు అన్నం మల్లికార్జునయాదవ్‌ది చింతకొమ్మదిన్నె మండలం నరసరామయ్యగారిపల్లె కాగా ఎంసీవీ మహేశ్వరరెడ్డిది ఖాజీపేట మండలం భూమాయపల్లె.

    చదవండి :  ఒంటిమిట్టకు 120 ప్రత్యేక బస్సు సర్వీసులు

    మల్లికార్జున యాదవ్ నేపధ్యం…

    mallikarjunతల్లిదండ్రులు పాలవ్యాపారం చేసేవారు. ఇంతకు ముందు సివిల్స్ రాయగా 252 ర్యాంకుతో ఇండియన్ ఫారిన్ సర్వీసు వచ్చింది.  ఐఏఎస్‌ సాధించాలని ఐఎఫ్‌ఎస్‌ను వదలుకున్నాడు. ఓబులవారిపల్లె మండలం వై.కోట పీహెచ్‌సీలో వైద్యుడుగా పనిచేస్తున్నారు.

    కుటుంబ ప్రోత్సాహంతోనే..

    తాను ఐఏఎస్ సాధించడానికి తన తల్లిదండ్రులు నాగమల్లయ్య, రాములమ్మ, అన్నయ్య రామూర్తి, వదిన సరిత, బావలు గిరిబాబు, చంద్రయాదవ్, సుబ్బరాయుడు యాదవ్, చెల్లెలు మల్లీశ్వరి, మామ సుబ్బరాయుడు, అత్త లక్ష్మిదేవితో పాటు మరికొందరి సహకారం మరువలేనిదని మల్లికార్జునయాదవ్ అన్నారు. ఎకరా పొలంలో వ్యవసాయంచేయడంతో పాటు పాలవ్యాపారం చేస్తూ తన తండ్రి తనను చదివించారన్నారు.

    చదవండి :  కడప నగరం

    మహేశ్వరరెడ్డి నేపధ్యం…

    మహేశ్వరరెడ్డి తల్లిదండ్రులు ఎం.సి.సుబ్బారెడ్డి, ఇంద్రావతి. సుబ్బారెడ్డి టెలికాం శాఖలో సీనియర్ టెలిఫోన్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ కడపలోనే నివాసం ఉన్నారు. మహేశ్వరరెడ్డి గత సంవత్సరం 510వ ర్యాంకు సాధించి రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో ఐఆర్‌టీఎస్ (ఇండియన్ రైల్వే ట్రాఫిక్‌సర్వీస్)లో శిక్షణ పొందుతున్నారు. శిక్షణలో ఉంటూనే సివిల్స్‌కు సిద్ధమై 196వ ర్యాంకు సాధించాడు.

     

    ఉమేష్‌చంద్ర స్ఫూర్తితో…

    జిల్లాలో ఉమేష్‌చంద్ర ఎస్పీగా పనిచేసినప్పుడు ఆయనను స్పూర్తిగా తీసుకున్న మహేశ్వరరెడ్డి కళ్లముందు ఖాకీదుస్తులు కదలాడాయి. ఆ కల నిజం చేసుకోవడానికి తపించాడు. 196వ ర్యాంకు సాధించాడు. ఐపిఎస్‌కు మార్గం సుగమం చేసుకున్నాడు.

    చదవండి :  కడప పార్లమెంటులో ఎవరికెన్ని ఓట్లు

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *