
మర్నాడు ఇడుపులపాయలో వైకాపా శాసనసభాపక్షం సమావేశం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం తొలి సమావేశం ఈ నెల 21న ఇడుపులపాయలో నిర్వహించనున్నారు.ముందుగా రాజమండ్రిలో నిర్వహించాలని భావించినప్పటికీ తొలి సమావేశంలో పార్టీకి స్ఫూర్తిప్రదాత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధికి నివాళులు అర్పించి ప్రారంభించాలన్న అభిప్రాయం మేరకు సమావేశం వేదికను ఇడుపులపాయకు మార్చారు.
21వ తేదీన ఉదయం 10 గంటలకు జరిగే ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు.అనంతరం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు పార్టీ తరఫున సీమాంధ్ర జిల్లాల్లో శాసనసభకు, లోక్‌సభకు పోటీ చేసిన అభ్యర్థులందరితోనూ ప్రత్యేకంగా సమావేశమవుతారని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.