
సమావేశానికి రాని వైకాపా నేతలు
కడప: గురువారం కడపలో జరిగిన వైకాపా జిల్లా సర్వసభ్య సమావేశానికి కొంతమంది నేతలు హాజరు కాలేదు. దీంతో ఆయా నేతలు వైకాపాకు దూరంగా జరుగుతున్నారంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.
రాజంపేట పార్లమెంటు సభ్యడు మిథున్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, పాటు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, బద్వేలు మాజీ ఎమ్మెల్యే గోవిందరెడ్డి, కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డిలు కూడా హాజరు కాలేదు.
ఇలా ముఖ్య నేతలు ముందస్తు సమాచారం ఇవ్వకుండా కీలక సమావేశానికి దూరంగా ఉంటే ఊహాగానాలకు అవకాశం ఇచ్చినట్లే. ఒకవేళ వీరంతా ముందుగానే పార్టీకి సమాచారం ఇచ్చి ఉంటే ఆ విషయాన్ని వైకాపా లేదా ఆయా నేతలు బయటికి చెబితే ఊహాగానాలకు ముగింపు పడుతుంది. లేని పక్షంలో పార్టీ శ్రేణులలో స్థైర్యం దెబ్బతినే అవకాశం ఉంది.