పులివెందుల శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన మరియు ఉపసంహరణల అనంతరం మొత్తం 14 మంది తుది పోరులో తలపడ్డారు. ఇక్కడ వైకాపా తరపున బరిలోకి దిగిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సుమారు 75 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి సతీష్ రెడ్డి (తెదేపా + భాజపాల ఉమ్మడి అభ్యర్థి) పై విజయం సాధించారు.
జగన్‌మోహన్‌రెడ్డి, యెడుగూరి సందింటి – వైకాపా – 124576
వెంకట సతీష్‌కుమార్‌రెడ్డి, సింగారెడ్డి – తెదేపా+భాజపా – 49333
రాజగోపాల్‌రెడ్డి, కొండ్రెడ్డి – కాంగ్రెస్ – 1884
రామేశ్వరరెడ్డి, గవిరెడ్డి – పిరమిడ్ పార్టీ – 1613
శివశంకర్‌రెడ్డి , దేవిరెడ్డి – నేకాపా – 865
రాఘవరెడ్డి, తూగుట్ల – ఆర్జేడీ – 625
కృష్ణా, దంతలూరు – ఆరేల్డీ – 346
వివేకానందరెడ్డి యాదవ్, యాదాటి – సమాజ్వాదీ – 321
రామకృష్ణారెడ్డి, సింగం – జైసపా – 279
భాస్కర్ రెడ్డి, రాజుల – లోక్జనశక్తి – 132
శ్రీనివాసులు, రాచినేని – ఆర్పీసిఎస్ – 130
శివచంద్రారెడ్డి, కొమ్మా – స్వతంత్ర అభ్యర్థి – 128
పెద్ద ఎరికలరెడ్డి, యాడికి – స్వతంత్ర అభ్యర్థి – 195
ఆంజనేయులు, కోనేటి – స్వతంత్ర అభ్యర్థి – 170
నోటా – 811