తెదేపా ఆహ్వానాన్ని పట్టించుకోవట్లేదా?

తెదేపా ఆహ్వానాన్ని పట్టించుకోవట్లేదా?

డీ ఎల్ కి తెలుగు దేశం నేతలు గాలమేసే ప్రయత్నాలు చేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే తెదేపా డీఎల్‌కు రాయబారం పంపి మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ పట్ల అంతగా వ్యతిరేకత చూపని డీఎల్‌కు జిల్లాలో కీలక బాధ్యత అప్పగిస్తామని ఆ పార్టీ నేతలు భరోసా ఇస్తున్నారు.

అయితే ఈ ఆహ్వానం పట్ల డీఎల్‌ నుంచి ఇంతవరకు సానుకూల స్పందన రాకపోవడంతో వేచి చూసే ధోరణిలో టీడీపీ నేతలు ఉన్నారు. రాబోయే ఎన్నికలలో తెదేపా చతికిలపడే అవకాశం ఉన్నందున ఆ పార్టీకి దూరంగా ఉండడమే మేలని డి.ఎల్ తలపోస్తున్నట్లు సమాచారం. రాజకీయాలకు గుడ్ బయ్ చెప్పి అల్లుడిని తన స్థానే పోటీకి దించాలని డి.ఎల్ ఆలోచన చేస్తున్నారన్న మరో ప్రచారం కూడా ఉంది.

చదవండి :  వైకాపాకు మైసూరారెడ్డి రాజీనామా

అల్లుడిని రంగంలోకి దించే పక్షంలో వైకాపా తరపున పోటీ చేయించాలని ఆయన ఆలోచిస్తున్నట్టు స్థానికంగా ఒక ప్రచారం ఉంది.

జిల్లాలో తెలుగు దేశం పార్టీ పూర్తిగా బలహీన పడిన నేపధ్యంలో డీఎల్ ను చేర్చుకుంటే పార్టీ పరిస్తితి మెరుగు పడుతుందని భావిస్తున్నారు. తెదేపాలో చేరేందుకు సమ్మతిస్తేనే డీఎల్‌తో చంద్రబాబు మాట్లాడతారని పార్టీ వర్గాలు అంటున్నాయి.ఇప్పటికే డీఎల్‌ అనుచరుల ద్వారా రహస్యంగా చర్చలు జరిపిన నేతలు పార్టీ అధినేతకు కూడా సమాచారం అందించారు.

చదవండి :  దేశం గూటికి చేరిన మేడా మల్లికార్జునరెడ్డి

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *