గురువారం , 21 నవంబర్ 2024

గాలేరు నగరి సుజల స్రవంతి

పథకం పేరు : శ్రీ కృష్ణదేవరాయ గాలేరు నగరి సుజల స్రవంతి సాగునీటి పథకము (ఆం.ప్ర ప్రభుత్వం 2 జులై 2015 నాడు ప్రాజెక్టు పేరు నుండి ‘శ్రీ కృష్ణదేవరాయ’ను తోలిగించింది)

ప్రధాన ఉద్దేశం : కృష్ణా నది వెనుక జలాల నుంచి కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు నీటిని తాగటానికి, సాగుకు సరఫరా చెయ్యడం. మొదట్లో కడప – కర్నూలు జిల్లాల సాగునీటి సరఫరా కోసం రూపొందించబడిన ఈ పథకాన్నితరువాత  చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు విస్తరించారు.

నీటి కేటాయింపులు: 38 టిఎంసిల మిగులు/వరద జలాలు

నీటిని ఎలా తరలిస్తారు : సాగునీటి కాలువలు (SRBC – Srisailam Right Branch Canal) మరియు బ్యాలెన్సింగ్ జలాశయాల ద్వారా

పథకంలో భాగంగా ఉన్న జలాశయాలు :

గోరకల్లు జలాశయం (కర్నూలు జిల్లా), అవుకు జలాశయం (కర్నూలు జిల్లా), గండికోట జలాశయం (కడప జిల్లా), వామికొండ జలాశయం (కడప జిల్లా), సర్వరాజ సాగర్ జలాశయం (కడప జిల్లా), దుర్గం సాగర్ జలాశయం (నెల్లూరు జిల్లా), వెలికొండ జలాశయం (చిత్తూరు జిల్లా), కృష్ణ సాగర్ జలాశయం (చిత్తూరు జిల్లా), శ్రీ బాలాజీ జలాశయం (చిత్తూరు జిల్లా), పద్మ సాగర్ జలాశయం (చిత్తూరు జిల్లా), శ్రీనివాస సాగర్ జలాశయం (చిత్తూరు జిల్లా), వేణుగోపాల సాగర్ జలాశయం (చిత్తూరు జిల్లా), వేపగుంట జలాశయం (చిత్తూరు జిల్లా), అడవి కొత్తూరు జలాశయం (చిత్తూరు జిల్లా)

చదవండి :  ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జలాల పంపకం

సాగునీరు ప్రయాణించే మార్గం :

నీలం సంజీవరెడ్డి సాగర్ లేదా శ్రీశైలం జలాశయం  (బీరవోలు) –> పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ (0 కి.మీ) –> ఎర్ర గూడూరు –> బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ (16.225 కిమీ వద్ద) –> మంచాలకట్ట –> గోరకల్లు జలాశయం (73 కి.మీ వద్ద, నిల్వ సామర్థ్యం: 10.29 టిఎంసిలు)  –> పాణ్యం –> రామతీర్థం –> నందవరం –> బనగానపల్లె –> సొరంగమార్గం –> అవుకు జలాశయం (130.7 కి.మీ వద్ద, నిల్వ సామర్థ్యం: 4.31 టిఎంసిలు – మొదట్లో ఈ జలాశయం నిల్వ సామర్థ్యం 1.48 టిఎంసిలుగా ప్రతిపాదించారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి ప్రోద్భలంతో అధికారులు జలాశయ నిల్వ సామర్థ్యాన్ని పెంచారు.) –> పెరుసోమల –> ఎర్రగుడి (ఇక్కడి నుండి కడప జిల్లాలోకి ప్రవాహం మొదలవుతుంది) –> వద్దిరాల –> కోన అనంతపురం –> లింగాపురం –> సొరంగ మార్గం (పొడవు: 5.25 కి.మీ)  –> గండికోట జలాశయం (183.57 కి.మీ వద్ద, నిల్వ సామర్థ్యం: 28 టిఎంసిలు, పెన్నానదిపైన నిర్మించబడిన ఈ జలాశయంలో ఎసార్బీసీ ద్వారా వచ్చిన కృష్ణా జలాలను కలుపుతారు) –> వామికొండ జలాశయం (207.9 కి.మీ వద్ద, నిల్వ సామర్థ్యం: 3.25 టిఎంసిలు) –> సర్వరాజ సాగర్ జలాశయం (216.2 కి.మీ వద్ద, నిల్వ సామర్థ్యం: 3.05 టిఎంసిలు) —>కాలువ రెండుగా చీలే చోటు –> [ఒక కాలువ ఇలా వెళ్తుంది –> దుర్గం సాగర్ జలాశయం (నెల్లూరు జిల్లా) –> వెలికొండ జలాశయం (చిత్తూరు జిల్లా) –> కృష్ణ సాగర్ జలాశయం (చిత్తూరు జిల్లా)] –> రెండవ కాలువ –> శెట్టిగుంట –> సొరంగమార్గం (437.5 కి.మీ వద్ద కడప జిల్లాలో ప్రవాహం ముగిసి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది) –> అవ్వాచారికోన (ఇక్కడ వాగులో కలుస్తుంది) –>  కరకంబాడి (ఇంతకు ముందే ఉన్న మల్లిమడుగు జలాశయానికి అనుసంధానిస్తారు) –> శ్రీ బాలాజీ జలాశయం (నిల్వ సామర్థ్యం: 3.00 టిఎంసిలు) –> సొరంగమార్గం –> తిరుపతి –> స్వర్ణముఖి నది (466.6కి.మీ వద్ద) –> పద్మ సాగర్ జలాశయం (472.57 కి.మీ వద్ద, నిల్వ సామర్థ్యం: 0.45 టిఎంసిలు) –> శ్రీనివాస సాగర్ జలాశయం (నిల్వ సామర్థ్యం: 0.44 టిఎంసిలు) –> వేణుగోపాల సాగర్ జలాశయం (నిల్వ సామర్థ్యం: 2.68 టిఎంసిలు) –> వేపగుంట జలాశయం (నిల్వ సామర్థ్యం: 0.53 టిఎంసిలు) –> అడవి కొత్తూరు జలాశయం (నిల్వ సామర్థ్యం: 1.00 టిఎంసిలు)

చదవండి :  'నిధులు కేటాయించి ప్రాజెక్టు పూర్తి చేయాల'

విశేషాలు:

గోరకల్లు, అవుకు జలాశయాల మధ్య SRBC కి సమాంతరంగా 57.70 కి.మీ పొడవైన వరద కాలువ కూడా ఉంది.

ఈ సాగునీటి పథకం కోసం ప్రభుత్వం 55764.77 ఎకరాల భూమిని సేకరించాల్సి వచ్చింది.

తిరుపతి నగర తాగునీటి అవసరాల కోసం గాలేరు – నగరి పథకానికి మార్పులు చేశారు. అందులో భాగంగా మూడు కొత్త జలాశయాలను (వేణుగోపాల సాగర్ , వేపగుంట, అడవి కొత్తూరు జలాశయాలు) 2006లో అదనంగా చేర్చారు.

చదవండి :  జీవో 69 (శ్రీశైలం నీటిమట్టం నిర్వహణ)

గాలేరి-నగరి చితూరు జిల్లాలో 94 కిలో మీటర్ల మేర ప్రవహించనుంది.

గాలేరు – నగరి సాగునీటి పథకం రేఖా చిత్రం:

పాత ప్రణాళిక ప్రకారం (ఇందులో కొత్తగా చేర్చబడిన 3 జలాశయాలు లేవు) :

ఇదీ చదవండి!

rajoli anakatta

కెసి కెనాల్ ప్రవాహ మార్గం

కెసి కెనాల్ అనేది కడప , కర్నూలు జిల్లాలకు సాగునీరు పారించే ఒక ప్రధాన కాలువ. కృష్ణా నది ఉపనది …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: