కంటిమి నీ సుద్దులెల్ల గడపరాయ – అన్నమయ్య సంకీర్తన

    కంటిమి నీ సుద్దులెల్ల గడపరాయ – అన్నమయ్య సంకీర్తన

    పదకవితా పితామహుడి ‘కడపరాయడు’ జగదేక సుందరుడు, అందగాడు. కడపరాయని సుద్దులను, వలపులను తలచుకొని ఆ సతి ఇట్లా  పరవశిస్తోంది…

    వర్గం: శృంగార సంకీర్తన
    రాగము: దేసాళం
    రేకు: 512
    సంపుటము: 13-68

    కంటిమి నీ సుద్దులెల్ల గడపరాయ
    యింటింట దారణలెక్కె నేమి చెప్పేదయ్యా ॥పల్లవి

    కొమ్మల చేత నెల్లాను కొలువు సేయించుకొంటా
    కమ్మి వలపు కొటారుగాఁ బెట్టేవు
    అమ్మరో పోఁకకుఁ బుట్టెడాయను సిగ్గులు నేడు
    యెమ్మెల సతుల భాగ్యాలేమి చెప్పేదయ్యా ॥కంటిమి

    చదవండి :  కడప జిల్లా పర్యాటక ఆకర్షణలు

    జలజ లోచనలతో సరసములాడుకొంటా
    మొలకనవ్వులను వాములు వేసేవు
    తలపులోన రతులు తరగని ధాన్యమాయ
    యెలజవ్వనుల ముద మేమి చెప్పేదయ్యా ॥కంటిమి

    కందువ నింతుల నిట్టే కాఁగిట బెనగుకొంటా
    చెందుచు మోవులపై లచ్చెన వెట్టేవు
    అంది శ్రీ వేంకటేశ నన్నలమి మెచ్చితివిట్టే
    యిందరి మురిపెములు యేమి చెప్పేదయ్యా ॥కంటిమి

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *