హైదరాబాద్: పయ్యావుల కేశవ్ ఎవరో తనకు తెలియదని, ఆ పేరు ఇప్పుడే మొదటిసారి వింటున్నానని సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ చెప్పారు.
కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల విషయం దర్యాప్తు చేయడం పెద్ద కుట్ర అని, సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు బంధువని వైఎస్ వివేకానందరెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ఆయన స్పందించారు.
ఆ ఆరోపణలను తాను టీవీ చానెళ్లలో చూడలేదని, ఎవరో ఫోన్ ద్వారా తనకు తెలియజేశారని అన్నారు. ఆ ఆరోపణలు తనకు ఆశ్చర్యాన్ని కలిగించాయన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు జరుపుతోందని అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో జరిగిన అక్రమాల కేసులో సచివాలయంలోని కొన్ని శాఖల నుంచి అవసరమైన ఫైళ్లను శుక్రవారం తీసుకున్నామని తెలిపారు.