జమ్మలమడుగు కాంగ్రెస్ శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి వైకాపా గూటికి తిరిగొచ్చారు. ఈ రోజు హైదరాబాదులో దీక్ష చేస్తున్న జగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.
గతంలో కడప ఉప ఎన్నికల సమయంలో ఆయన జగన్ కే మద్దతు ఇచ్చారు. కాకపోతే ఆ తర్వాత కాంగ్రెస్ అదికారంలో ఉండడంతో తనకు వ్యక్తిగతం గా వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జగన్ కు కొంత దూరంగా ఉండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు చెబుతున్నారు.
ఆయన సోదరుడు నారాయణరెడ్డి ఇప్పటికే వైకాపా ఎమ్మెల్సీగా ఉన్నారు. జమ్మలమడుగు నుంచి పెద్ద ఎత్తున అభిమానులతో కలిసి వచ్చి ఆదినారాయణ రెడ్డి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరుతున్నారు.