జాతీయస్థాయి పోటీలకు అంకాళమ్మగూడూరు బడిపిల్లోల్లు

కడప: జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు అంకాళమ్మగూడూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అయిదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.

గతనెల కృష్ణా జిల్లాలో సీబీఆర్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ 60వ హ్యాండ్‌బాల్ పోటీల్లో సత్తా చాటి జాతీయస్థాయి పోటీలకు వీరు ఎంపికయ్యారన్నారు. అండర్-14 బాలుర విభాగంలో కె.పెద్దిరాజు, బాలికల విభాగంలో దీపిక, కడపనాగయ్యపల్లికి చెందిన లక్ష్మీచంద్రిక, తేజస్విని ఈ పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. అండర్-17 బాలికల విభాగంలో కడపనాగయ్యపల్లికి చెందిన అనూష జాతీయస్థాయి పోటీకి ఎంపికయ్యారు.

చదవండి :  వైఎస్సార్ క్రీడాపాఠశాల విద్యార్థులకు పతకాల పంట

డిసెంబర్‌లో మహారాష్ట్రలోని నాగపూర్‌లో అండర్-14 జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు జరుగుతాయి.

వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 8 వరకూ అండర్-17 జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు డిల్లీలో జరగనున్నాయి.

జాతీయస్థాయి పోటీల్లో వీరు విజయాలు సొంతం చేసుకోవాలని కాంక్షిద్దాం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: