స్టార్ హోటల్, విమానశ్రయం అందుబాటులోకి వస్తే …..
కడపలో స్టార్ హోటల్ సదుపాయం, విమానశ్రయం అందుబాటులోకి వస్తే వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రీడామైదానంలో వన్డే మ్యాచ్‌లు నిర్వహిస్తామని బీసీసీఐ క్యూరేటర్ నారాయణరాజు అన్నారు. 2002 నుంచి కర్నాటక క్రికెట్ అసోసియేషన్‌కు చీఫ్ క్యూరేటర్‌గా పనిచేసిన ఈయన ఇటీవలే బీసీసీఐ క్యూరేటర్‌గా బాధ్యతలు చేపట్టి తొలిసారి కడపకు వచ్చారు.
శనివారం ఆంధ్రా, కేరళ జట్ల మధ్య జరగనున్న రంజీ మ్యాచ్‌కు సంబంధించిన పిచ్‌ను పరిశీలించడానికి బీసీసీఐ నుంచి వచ్చిన నారాయణరాజు రాజారెడ్డి స్టేడియాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. దేశంలోని పెద్దపెద్ద స్టేడియంలకు ఏమాత్రం తీసిపోనిరీతిలోఅద్భుతంగా ఉందన్నారు.
స్టార్ హోటల్ సదుపాయం, విమానశ్రయం అందుబాటులోకి వస్తే వన్డే మ్యాచ్‌లు నిర్వహిస్తామన్నారు. వీటికి తోడు 2013లో మరిన్ని మంచిమ్యాచ్‌లను కడపలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు