సైనిక పాఠశాలల్లో 6,9తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

కోరుకొండ, కలికిరి సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిదో తరగతులలో ప్రవేశానికి సైనిక పాఠశాల దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  దరఖాస్తుదారులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి.

వయస్సు: ఆరో తరగతిలో ప్రవేశం పొందగోరు విద్యార్థులు 02 Jul 2004 & 01 Jul 2005 మధ్య జన్మించి ఉండాలి.

తొమ్మిదో తరగతిలో ప్రవేశం పొందగోరు విద్యార్థులు 02 Jul 2001 & 01 Jul 2002 మధ్య జన్మించి ఉండాలి

మొత్తం ఖాళీలు:

కోరుకొండ సైనిక పాఠశాల – ఆరో తరగతి – 90, తొమ్మిదో తరగతి – 25

చదవండి :  మొదటి దశలో 80.40 శాతం పోలింగ్

కలికిరి సైనిక పాఠశాల – ఆరో తరగతి -125, తొమ్మిదో తరగతి – 0

ప్రవేశ పరీక్ష తేదీ: 4 జనవరి 2015 (ఆదివారం)

పరీక్షా కేంద్రాలు: కడప, తిరుపతి, కలికిరి, కర్నూలు, అనంతపురం, గుంటూరు, హైదరాబాదు, కరీంనగర్, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం, విజయవాడ మరియు రాజమండ్రి.

రిజర్వేషన్లు: ST (7.5%), SC(15%), రక్షణ శాఖకు చెందిన సైనికుల పిల్లలకు (25%)

దరఖాస్తు విధానం: దరఖాస్తులను www.sainikschoolkorukonda.org అనే వెబ్ సైట్ నుంచి దిగుమతి చేసుకుని పూర్తిచేయాలి. పూర్తి చేసిన దరఖాస్తుకు రుసుం (రూ.475 (జనరల్ విభాగం) రూ.325 (ఎస్సీ, ఎస్టీ వర్గాలు)) The Principal, sainik school, korukonda payable at State Bank of India, Sainik School, Korukonda Branch, Code No.2791 పేర డీడీ తీయాలి. దరఖాస్తుకు డిడిని జతచేసి కోరుకొండ సైనిక పాఠశాలకు పంపాలి.

చదవండి :  ఆదివారం ప్రొద్దుటూరుకు బాలయ్య

దరఖాస్తుకు చివరి తేదీ : 6 డిసెంబర్ 2014

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: