
సెలాకు అనే పదానికి అర్థాలు, వివరణలు
కడప జిల్లాలో వాడుకలో ఉన్న సెలాకు అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘సెలాకు’ in Telugu Language.
సెలాకు లేదా శలాకు లేదా చలాకు:
నామవాచకం (noun), ఏకవచనం (Singular)
- ఒక వంట సామాను
- దోశ లేదా చపాతిని పెనం మీద తిప్పుటకు ఉపయోగించు పరికరం
- Dosa turner
- ladle (ఆంగ్లం)
సెలాకులు లేదా చలాకులు (Plural)
వివరణ :
కడప జిల్లాలో సెలాకు అనే పదాన్ని ladle అనే ఆంగ్ల పదానికి సమానార్థకంగా వాడతారు. దోశ లేదా చపాతీలను పెనం పైన తిప్పడానికి ఉపయాగించే వంట సామాను.
వాడుక :
- బాగా కాలిన దోశను సెలాకుతో రెండో పక్కకు తిప్పుకోవాలి
- ఓబ్బీ! చలాకు ఎంత?
- చపాతి తిప్పుకోవటానికి వీలుగా శలాకు దగ్గర పెట్టుకోవాలి