
సురేంద్రకు జీవిత సాఫల్య పురస్కారం
2013 సంవత్సరానికి గాను ‘కార్టూన్ వాచ్’ జీవిత సాఫల్య పురస్కారానికి కార్టూనిస్టు సురేంద్ర ఎంపికయ్యారు. ఈ నెల 29వ తేదీన ‘కార్టూన్ ఫెస్టివల్’లో భాగంగా రాయ్ పూర్ లోజరిగే కార్యక్రమంలో సురేంద్రకు పురస్కారాన్ని ప్రధానం చేయనున్నారు. చత్తీస్ఘడ్ ముఖ్యమత్రి రమణ్ సింగ్, ఆ రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి బ్రుజ్మోహన్ అగర్వాల్ లు పురస్కార ప్రదానోత్సవానికి హాజరవుతారు. ‘కార్టూన్ వాచ్’ దేశంలోని ఏకైక కార్టూన్ మాస పత్రిక.
గతంలో ఆర.కె.లక్ష్మణ్, అజిత్ నైనన్, సుధీర్ తైలాంగ్ ‘కార్టూన్ వాచ్’ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.
సురేంద్ర ప్రస్తుతం ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది హిందూ’లో కార్టూనిస్టుగా పని చేస్తున్నారు. అంతకు మునుపు వీరు ఆంధ్రభూమి, ఉదయం దినపత్రికలలో కార్టూనిస్టుగా పని చేశారు. సురేంద్ర స్వస్తలం కడప జిల్లాలోని ‘హనుమనగుత్తి’ గ్రామం. సురేంద్ర ప్రముఖ రచయిత పి.రామకృష్ణ కుమారుడు.
1 Comment
Good to hear. Congratulations to Surendra!!