సోమవారం , 16 సెప్టెంబర్ 2024

సీమ ప్రాజెక్టులకు శానా తక్కువ నిధులు కేటాయించినారు

ఇప్పటికే అన్ని సాగునీటి ప్రాజెక్టులూ అందుబాటులో ఉండి దర్జాగా మూడు పంటలు పండించుకుంటున్న కృష్ణా డెల్టాకు సంబంధించి ప్రాజెక్టుల నిర్వహణకు, అదునికీకరణకు ఎక్కువ కేటాయింపులు చేసిన ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో పూర్తి అశ్రద్ధను చూపింది. సీమ సాగునీటి ప్రాజెక్టులకు మొక్కుబడిగా శానా తక్కువ నిధులను  కేటాయించి ఈ ప్రాంతంపైన తన నిబద్ధతను, నిర్లిప్తతను మరోసారి చాటుకుంది.

2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను రాయలసీమకు గుండెకాయ వంటి గాలేరు – నగరి పథకాన్ని పూర్తి చేయటానికి రూ.399.60 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే బుధవారం రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.55.14 కోట్లను కేటాయించారు. అందులో 50శాతం గ్రాంటు ఆర్‌అండ్‌ఆర్‌కు వినియోగించాలనే నిబంధన విధించించినారు. అడిగిన దాంట్లో కేవలం 13.79 శాతం మాత్రమే ఇచ్చినారు. ఈ పథకానికి మంత్రిగారు మునుపటి ఏడాదితో పొల్చితే కేవలం 17.15 శాతం నిధులను కేటాయించినారు.

గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం ద్వారా 2.60 లక్షల ఎకరాలకు సేద్యపు జలాలను ఇచ్చేందుకు నాడు రూపకల్పన చేశారు. కడపలో తొలి దశలో 35 వేల ఎకరాలకు, రెండో విడతలో 1.20 లక్షల ఎకరాలు, చిత్తూరులో 1.03,500, నెల్లూరులో 1500 ఎకరాలకు నీరందించాల్సి ఉంది. రూ.173 కోట్లు వెచ్చిస్తే జీఎన్‌ఎస్‌ఎస్ మొదటి దశ పనులు పూర్తి అయ్యేవి.

చదవండి :  హైదరాబాద్ లేకపోతే బతకలేమా!

గత పదేళ్ళలో గాలేరు నగరి కేటాయింపులు

2005-06 ఆర్ధిక సంవత్సరంలో రూ.321 కోట్లు కేటాయించగా  202.49 కోట్లు ఖర్చు చేశారు.
2006-07 –  ఆర్ధిక సంవత్సరంలో 330 కోట్లు కేటాయించగా  555.62 కోట్లు ఖర్చు చేశారు.
2007-08 ఆర్ధిక సంవత్సరంలో675 కోట్లు కేటాయించగా 549.26 కోట్లు ఖర్చు చేశారు.
2008-09 ఆర్ధిక సంవత్సరంలో1,070 కోట్లు కేటాయించగా 759.74కోట్లు ఖర్చు చేశారు.
2009-10 ఆర్ధిక సంవత్సరంలో1,018.68 కోట్లు కేటాయించగా 770.81 కోట్లు ఖర్చు చేశారు.
2010-11 ఆర్ధిక సంవత్సరంలో660 కోట్లు కేటాయించగా 380కోట్లు ఖర్చు చేశారు.
2011-12 ఆర్ధిక సంవత్సరంలో540 కోట్లు కేటాయించగా 316.5 కోట్లు ఖర్చు చేశారు.
2012-13 ఆర్ధిక సంవత్సరంలో419.86 కోట్లు కేటాయించగా 275.26 కోట్లు ఖర్చు చేశారు.
2013-14 ఆర్ధిక సంవత్సరంలో321.5 కోట్లు కేటాయించగా 157.97కోట్లు ఖర్చు చేశారు.

చదవండి :  ఆంటోనికి నోరు లేదు, దిగ్విజయ్‌ తెలియనోడు

అలాగే కేసీ కెనాల్ ఆధునికీకరణకు కేవలం రూ.8.4కోట్లు మాత్రమే కేటాయించారు. మైలవరం ఆధునికీకరణకు రూ.8.16కోట్లు, తెలుగుగంగకు రూ.89.6కోట్లు, పీబీసీకి రూ.27.8కోట్లు కేటాయించారు. అనంతపురం జిల్లాలోని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టుకు మాత్రం రూ.100.28కోట్లు కేటాయించారు. ఎస్సార్‌బీసీకి రూ.12.48కోట్ల కేటాయింపులు దక్కాయి. వెలిగల్లు, చెయ్యేరు, దిగువ సగిలేరు, ఎగువ సగిలేరు, బుగ్గవంక ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులు లేవు.మొన్న కర్నూలులో ముఖ్యమంత్రి సెప్పి పోయిన కొత్త సాగునీటి ప్రాజెక్టుల ఊసు కూడా బడ్జెట్ లో లేకపోవడం కొసమెరుపు.

కోస్తా కేటాయింపులు చూడండి…

ఇప్పటికే అన్ని ప్రాజెక్టులూ అందుబాటులో ఉండి దర్జాగా మూడు పంటలు పండించుకుంటున్న డెల్టా ప్రాజెక్టుల నిర్వహణకు, అదునికీకరణకు ఎక్కువ కేటాయింపులు చేసి ప్రభుత్వం తన మక్కువను చాటుకుంది.  గుంటూరు జిల్లా పరిధిలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువల ఆధునికీకరణకు ఈ బడ్జెట్‌లో రూ.549.03 కోట్లు, నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణకు రూ.18.2 కోట్లు,  కృష్ణా డెల్టా కాలువల ఆధునికీకరణకు రూ.120.14 కోట్ల కేటాయింపులుజరిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కృష్ణా డెల్టా కాలువలున్నాయి. కేంద్రం నుండి నిధులు అందనున్న పోలవరానికి సైతం రాష్ట్ర బడ్జెట్ లో 138.3 కోట్లు కేటాయించారు.

చదవండి :  15 వేలతో కోదండరామునికి తలంబ్రాలూ, పట్టు గుడ్డలు

ఏమీ మారలేదు…

తొమ్మిదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తెదేపా పెండింగ్ లో ఉన్న సీమ ప్రాజెక్టుల విషయంలో నామమాత్రపు కేటాయింపులు జరిపి గత హయాం నుండి ఇప్పటి వరకూ ఈ ప్రాంతంపై తన వైఖరి మారలేదని చాటుకుంది. దీనిపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో ఏ ఒక్క పెండింగ్ ప్రాజెక్టూ సీమలో అందుబాటులోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది.

గమనిక: ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమయ్యే కొద్దీ ఆయా ప్రాజెక్టులకు దక్కవలసిన నీటి లభ్యత, కేటాయింపులు తగ్గిపోయే ప్రమాదముంది.

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: