
‘సీమ ప్రజల గొంతు నొక్కినారు’
కర్నూలు: రాజధాని సీమ ప్రజల హక్కుఅని, రాయలసీమ ప్రత్యేక రాష్ట్రమే అంతిమ లక్ష్యమని రాయలసీమ ప్రజాసమితి అధ్యక్షుడు క్రిష్ణయ్య, ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంరాష్ట్ర కో-కన్వీనర్ శ్రీనివాసులు గౌడ్, బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్స్‌ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోనేటి వెంకటేశ్వర్లు, రైతు కూలీ సంఘంజిల్లా కార్యదర్శి సుంకన్నలు స్పష్టం చేశారు.
కర్నూలు నగరంలోని జార్జిరెడ్డి భవనంలో శనివారం కర్నూలు రాజధాని, రాయలసీమ రాష్ట్ర ఉద్యమ కార్యాచరణ కర పత్రాలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర పూర్య రాజధాని కర్నూలులో పంద్రాగస్టు వేడుకల్లో స్వాతంత్ర పోరాటంలోని అమరవీరులను స్మరించుకోవాల్సి ఉండగా నగరం మొత్తాన్ని పొలీసుల ప్రహరిలో దిగ్బంధం చేసి సీమ ప్రజల గొంతు నొక్కి జరిపించారని వాపోయారు. సంఘం నాయకులు కురువ బలరాం, రాయలసీమ నిర్మాణ సమితి అధ్యక్షుడు జనార్థన్, రాయలసీమప్రజా సమితి ఉపాధ్యక్షుడు కె.నాగభూషణంలు పాల్గొన్నారు