
రేపు కడపలో సీమ కథల పుస్తకాల ఆవిష్కరణ
కడప: ‘రాయలసీమ తొలితరం కథలు’ , ‘సీమ కథా తొలకరి’ పుస్తకాల అవిష్కరణ సభ ఈ నెల 11వ తేదీ బుధవారం సాయంత్రం 5-30 గంటలకు ఎర్రముక్కపల్లె సిపి బ్రౌన్‌బాషా పరిశోధన కేంద్రం బ్రౌన్‌శాస్ర్తీ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు ఆ సభ నిర్వహకులు, పరిశోధకుడు డాక్టర్ తవ్వా వెంకటయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కథారచయిత తవ్వా ఓబుల్ రెడ్డి అతిధులకు ఆహ్వానం పలుకుతారని, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా కర్నూలు కథరచయిత డాక్టర్ ఎమ్ హరికిషన్, ముఖ్యఅతిథులుగా సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, రాయలసీమ మహాసభ అధ్యక్షులు డాక్టర్ శాంతి నారాయణ, సాహిత్యనేత్రం సంపాదకులు శశిశ్రీ, గౌరవ అతిథులుగా యోవేవి తెలుగు శాఖ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తప్పెట రామప్రసాద్‌రెడ్డి, లలితకల విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మూలె మల్లికార్జునరెడ్డి, ఖాజీపేట అధ్యాపకుడు వై ప్రభాకర్‌రెడ్డి, బాషా పరిశోధకులు విద్వాన్ కట్టానరసింహులు, అత్మీయ అతిథులుగా ‘రాయలసీమ తొలితరం కథలు’ సంకలన కర్త తవ్వా వెంకటయ్య, పుస్తక సమీక్షకులుగా తిరుపతి ఎస్వీయు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ రాజేశ్వరమ్మ, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత వేంపల్లి షరీఫ్, పుస్తక స్వీకర్తలుగా రాచపాళెం చంద్రశేఖర్ దంపతులు (‘రాయలసీమ తొలితరం కథలు’), పిడుగు నాగుసుధాకర్‌రెడ్డి దంపతులు (సీమ కథా తొలకరి) పాల్గొంటారన్నారు.
ఈ ఆవిష్కరణ సభకు కవులు,సాహితిప్రియులు, అభిమానలు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.