‘సాహిత్య విమర్శ’లో రారాకు చోటు కల్పించని యోవేవి

తెలుగులో రెండు సంవత్సరాల ఎం.ఏ కోర్సును అందిస్తున్న కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం నాలుగవ సెమిస్టర్ లో విద్యార్థులకు ‘తెలుగు సాహిత్య విమర్శ’ (పేపర్ 401) పేర ఒక సబ్జెక్టును బోధిస్తోంది. వల్లంపాటి వెంకటసుబ్బయ్య, రాచపాలెం, ఆరుద్ర, ఎస్వీ రామారావు, లక్ష్మణ చక్రవర్తి, జివి సుబ్రహ్మణ్యం, బ్రహ్మానంద, వీరభద్రయ్య తదితరుల రచనలకు ఇందులో చోటు కల్పించిన యోవేవి రాచమల్లు రామచంద్రారెడ్డి రాసిన విమర్శా వ్యాసాలకు కనీసం చోటు కల్పించకపోవటం గర్హనీయం.(http://www.yogivemanauniversity.ac.in/fwd/TELUGU.pdf)

తెలుగు సాహితీ జగత్తులో విమర్శలో తనదైన ముద్ర వేసి, ఆ పక్రియకు ఒక కొత్త సొబగును తెచ్చిపెట్టి ఎందరికో మార్గదర్శకుడైన రారాకు కడప జిల్లాలో ఉన్న యోగి వేమన విశ్వవిద్యాలయం ‘సాహిత్య విమర్శ’ పాఠాలలో చోటు కల్పించకపోవటమంటే ఆయన సాహిత్య కృషిని గుర్తించకపోవటమే. మరో రకంగా చెప్పాలంటే సాహితీ విమర్శలో రారా కృషిని రేపటి తరానికి తెలియచేయకుండా తొక్కిపెట్టడమే! ఒక రకంగా ఇది యోవేవిలోని తెలుగు విభాగం చేసిన దుస్సాహసమే!

చదవండి :  మీరు వింటున్నది 103.6 కడప ఎఫ్ఎం
యోవేవి తెలుగు విమర్శ సిలబస్
తెలుగు విమర్శ సిలబస్

స్థానికంగా ఉన్న ఒక విశ్వవిద్యాలయం తెలుగు సాహిత్య విమర్శలో అగ్రగణ్యుడైన ఒక స్థానిక రచయితకు అకడమిక్స్ లో  చోటు కల్పించకపోవటం ద్వారా ఇస్తున్న సందేశం ఏమిటీ? ఇంతటి దుస్సాహసాన్ని కడప జిల్లా రచయితలు ప్రశ్నించకపోవటం ఏమిటీ? ఇప్పటికైనా విశ్వవిద్యాలయంపైన కడప జిల్లా కవులూ, రచయితలూ ఒత్తిడి తెచ్చి అకడమిక్స్ లో రారా రచనలకు చోటు కల్పించేందుకు కృషి చేయాలి.

మందలపర్తి కిషోర్ మాటల్లో చెప్పాలంటే “రారా గా ప్రసిద్ధుడయిన విమర్శకుడూ, సంపాదకుడూ, కథకుడూ, అనువాదకుడూ సిసలయిన మేధావీ కడప జిల్లాకు చెందిన రాచమల్లు రామచంద్రారెడ్డి (1922-88). స్వపరభేదాలు పాటించని విమర్శకుడు. పిసినారి అనిపించేటంత పొదుపరి కథకుడు. ముళ్లలోంచి పువ్వులను ఏరే కళలో ఆరితేరిన సంపాదకుడు. మూలరచయిత మనసును లక్ష్యభాషలోని పాఠకుడికి సమర్థంగా చేర్చిన అనువాదకుడు. అక్షరాంగణంలో నిలువెత్తు విగ్రహాలుగా పాతుకు పోయిన ‘ప్రముఖుల’ గుట్టురట్టు చెయ్యడానికి క్షణమాత్రం జంకని విగ్రహ విధ్వంసి. ఒక్కమాటలో చెప్తే- మూడున్నర దశాబ్దాల సాహిత్య జీవితంలో ఒక వ్యక్తి చెయ్యగలిగిన కృషికన్నా అనేక రెట్లు ఎక్కువ చేసిన అక్షర కర్షకుడు రారా.”

చదవండి :  పద్మనాభరెడ్డి ఎందుకు జడ్జి కాలేకపోయారు?

తెలుగు సాహిత్యంలో విమర్శ యొక్క నిజమైన వాడినీ, వేడినీ చూపినవాడు రారా. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సాహిత్య విమర్శలో రారా అగ్రగణ్యుడు.

‘వేయిపడగల విశ్వనాథ’ను చెరిగిపోసినందుకూ – దిగంబర కవులను చావగొట్టి చెవులు మూసినందుకూ – కాళోజీ అనువాద సరళిని నరికిపోగులు పెట్టినందుకూ – అద్దేపల్లి రామమోహనరావు అన్వయ వైపరీత్యాన్ని కడిగి ఎండేసినందుకూ – రా.రా.ను చాలామందే విమర్శించారు.

ఆయన రాసిన ‘అనువాద సమస్యలు’ అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన రాసిన మరో ప్రసిద్ధ గ్రంథం ‘సారస్వత వివేచన’. దీనికి రాష్ట్ర సాహిత్య అకాడెమీ బహుమతి లభించింది.

చదవండి :  "నారాయణ" లీలలు: రాజధాని కమిటీ మాయ : 1

ఇదీ చదవండి!

samvedana magazine

సంవేదన (త్రైమాసిక పత్రిక) – జులై 1968

పుస్తకం : సంవేదన ,  సంపాదకత్వం: రాచమల్లు రామచంద్రారెడ్డి , ప్రచురణ : యుగసాహితి, జులై 1968లో ప్రచురితం. చదవండి …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: