సాక్షి బ్యాంకు ఖాతాలను స్తంభింప చేసిన సిబిఐ! – ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ముందే సిద్ధమైన జగన్?

    ఉపఎన్నికలు సమీపిస్తున్న కీలక తరుణంలో సాక్షి టివీ, సాక్షి పత్రికల భ్యాంకు ఖాతాలను సిబిఐ స్థంభింపచేసింది. ఇది కుట్రపూరితం అని, ప్రజాస్యామ్యంపై దాడి అని కంపెనీ అధినేత, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ తీవ్రంగా ఖండించారు. అయితే అధికార కాంగ్రెస్, విపక్ష తెదేపాలు సిబిఐ చర్యను సమర్థించడం విశేషం. జగన్ ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సాక్షి మేనేజింగ్ ఎడిటర్ దిలీప్ రెడ్డి ఉద్యోగులు అధైర్యపడవద్దని అన్నారు.

    చదవండి :  కాంగ్రెస్‌ సమర్పించు.. హైప్‌ మీడియా డ్రీమ్‌ ప్రొడక్షన్స్‌.. జైల్లో జగన్‌ -1

    దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందన్నదానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే రోజులలో టీవీ, పత్రిక నడపడం కష్టం అయ్యేలా వ్యూహాన్ని అమలు చేయవచ్చని, తద్వారా జగన్ మరిన్ని సమస్యలు ఎదుర్కోవచ్చని అంటున్నారు.

    ys jagan

    ఉప ఎన్నికలలో దీని ప్రభావం వలన జగన్ కు ఇంకా సానుభూతి పెరిగి అది మరింత ఘన విజయానికి దారి తీసే అవకాశం ఉంది. అయితే జగన్ కేసుతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అంటున్నారు.

    చదవండి :  వైఎస్‌ను దొంగగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తే..

    ఇటీవలి కాలంలో సాక్షి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేక ప్రచారం తీవ్రంగా చేస్తున్నదని ,అందువల్ల కాంగ్రెస్ హై కమాండ్ దానిని దెబ్బతీయడానికి ఈ చర్య చేపట్టి ఉండవచ్చని కూడా అంటున్నారు.గతంలో ఇలా సాక్షి బ్యాంకు ఖాతాలను సీజ్ చేయవచ్చని కధనాలు వచ్చాయి.

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *