
సమైక్యాంధ్ర కోసం జిల్లాలో రాజీనామాలు
సమైక్యాంధ్ర కోసం కడప జిల్లాలో రాజీనామాల పర్యవం మొదలైంది. సమైక్యాంధ్ర జేఏసిీ, విద్యార్థి జేఏసిీ నేతలు ఆదివారం నిర్వహించిన సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు.
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, బచ్చల పుల్లయ్యలు స్పీకర్ ఫార్మెట్‌లో వేదికపైనే రాజీనామాలు చేశారు.
సీమాంధ్రలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎం పీలు సహా మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేసేలా విద్యార్థులు ప్రజలు ఒత్తిడి తేవాలని సమైక్యాంధ్ర జేఏసిీ నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం విభజిస్తే అగ్నిగుండంగా మారుస్తామని పేర్కొన్నారు.