తవ్వా ఓబుల్‌రెడ్డిని సత్కరించిన జాతీయ పాత్రికేయ సంఘం

    తవ్వా ఓబులరెడ్డిని సత్కరిస్తున్న జాతీయ పాత్రికేయ సంఘం ప్రతినిధులు

    తవ్వా ఓబుల్‌రెడ్డిని సత్కరించిన జాతీయ పాత్రికేయ సంఘం

    బుధవారం కడపలో జరిగిన 22వ రాష్ట్ర మహాసభలో కథకుడు, కడప.ఇన్ఫో గౌరవ సంపాదకులు తవ్వా ఓబుల్‌రెడ్డిని జర్నలిస్ట్స్ అషోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( జాప్ ) ఘనంగా సత్కరించింది. సీనీయర్ పాత్రికేయులైన ఓబుల్ రెడ్డి గతంలో జాప్‌కు కడప జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేసినారు.

    జాతీయ పాత్రికేయ సంఘం ( ఎన్.యు.జె ) అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ , జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగా రెడ్డి, జిల్లా పరిషత్ అధ్యక్షుడు గూడూరు రవి, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు ప్రత్తిపాటి సుమనకుమారి, జాప్ జిల్లా నేతలు శశిశ్రీ, , క్రిష్ణయ్యయాదవ్ ల సమక్షంలో ఓబుల్ రెడ్డికి ఈ సత్కారం జరిగింది. ఇదే సందర్భంలో జిల్లాకు చెందిన కొందరు సీనియర్ పాత్రికేయులను, రచయితలను కూడా జాప్ సన్మానించింది.

    చదవండి :  కొండపేట కమాల్ - రంగస్థల నటుడు

    www.www.kadapa.info, www.mydukur.com వెబ్సైట్‌ల సాంస్కృతికాంశాలకు గౌరవ సంపాదకులుగా వ్యవహరిస్తున్న ఓబుల్‌రెడ్డి గత యేడాది రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘గండికోట’ పుస్తకానికి గాను ఉత్తమ గ్రంధ రచయిత అవార్డును అందుకున్నారు.

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      1 Comment

      • good effort reddy garu

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *