ఆదివారం , 6 అక్టోబర్ 2024

ప్రకృతీ అంతే! ప్రభుత్వాలూ అంతే!

పల్లెలో పండుగ సందడి కన్పించటం లేదు. టౌన్నించి ఆటో దిగే వాళ్ల చేతుల్లో సగం సంచినిండా కూడా పండుగ సరకులు లేవు. సంవత్సరానికంతా ఇదే పెద్ద పండుగ గదా! ఆ కొద్ది దినుసులతో మూడురోజుల పండుగను ఎలా యీదగలరో మరి!

ఇంటి ముందు పేడనీళ్లు – ఇంట్లో చారు నీళ్లతోనే పండుగ జరిగిపోయేట్టుంది. బెల్లంకూడూ నేతిబొట్టు అనుపాకం కుదరకుండానే, అలసంద వడలు సియ్యల పులుసు తోడు లేకుండానే, అప్పచ్చులు కారేల వియ్యమందకుండానే పండుగ దాటిపోయేట్టుంది మా పల్లె జనానికి.

చదవండి :  పట్టిసీమ మనకోసమేనా? : 2

సైకిళ్ల మీద బట్టల మూటలతో వీధివీధీ సందుసందూ తిరిగే చిరువ్యాపారుల సందడి తగ్గింది. సవాలు గుడ్డల వాళ్ల అరుపులు రాత్రిళ్లు రచ్చబండల మీద నుంచి వీధుల్ని మార్మోగించటం లేదు.

కరువు రాయలసీమ బతుకుల్ని కాటేసింది.

పెద్ద పండక్కయినా ఋణమాఫీ గొడవ పూర్తయి బ్యాంకుల్లో తిరిగి ఋణం ఇస్తారనుకొంటే సింగపూరునో టోక్యోనో తెచ్చి కోస్తా వరిమళ్లల్లో నిలేసి ఆంధ్రుల రాజధానిగా అంటగట్టే పనిమీద మన సచివులంతా నిమగ్నమై వున్నారు.

** ప్రభుత్వ ఉద్యోగిగా 27 సంవత్సరాలుగా చూస్తున్నా–ప్రతి ఏడాదీ ఏదొక తుఫాను మా నెల జీతాల్లోంచి ఒకటి రెండు రోజుల జీతాన్ని కోస్తా ప్రాంతానికి అందజేస్తూ వుంది. మేమందుకు బాధపడటం లేదు. కానీ … ఎముకల్లో మూలగను కూడా పీల్చి విసరి పారేసే ఇన్నిన్ని కరువుల్లో ఒక్క కరువన్నా ఒక్క ఉద్యోగి ఒక్కరోజు జీతాన్ని కూడా ఆధరువుగా పొందలేక పోతోంది.

చదవండి :  "కడప దేవుని గడప" అని ఎందుకంటారో ...

మా బతుకుల్ని ఛిద్రం చేసే కరువులు తుఫానుల్లాగా నిజాయితీగా వాటి అసలు రూపంతో రాకుండా మారు వేషాలతో వచ్చి గోముఖ వ్యాఘ్రాలై మీదబడి మా వుసురు తీసికొంటున్నాయి. ప్రకృతీ అంతే! ప్రభుత్వాలూ అంతే! ఇక్కడి ప్రజా ప్రతినిధులూ అంతే!

– సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

ఇదీ చదవండి!

సీమపై వివక్ష

‘సీమ’పై వివక్ష ఇంకా ఎన్నాళ్లు?

‘వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు..’ అన్న సామెత రాయలసీమకు మాత్రం వర్తించదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: