
ఈ రోజు కడపకు శివరామక్రిష్ణన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నేడు కడప జిల్లాలో పర్యటించనుంది. ఉదయం 10.30 గంటలకు కడపలోని సభా భవనంలో జిల్లా అధికారులతో కమిటీ సమావేశం కానుంది. కొత్త రాజధాని ఏర్పాటుపై అభిప్రాయాలు, వినతలు స్వీకరించనుంది.
ఇప్పటికే ఒకసారి ఆయా ప్రాంతాలలో పర్యటించి పర్యటనలు పూర్తైనట్లు ప్రకటించిన శివరామకృష్ణన్ కమిటీ ఇప్పుడు మళ్ళీ పర్యటిస్తుండడం వెనుక మతలబు ఏమిటో?
ఒక పక్క కమిటీ ఇలా పర్యటనలు చేస్తోంటే రాష్ట్ర మంత్రులూ, ముఖ్యమంత్రీ రాజధాని, పలు సంస్థలూ గుంటూరు – విజయవాడల మధ్యే అని ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా అక్కడ ఎలివేటెడ్ రహదారుల నిర్మాణం గురించి ప్రకటనలు చేస్తున్నారు.
మొత్తానికి ఆగస్టు 15న ముఖ్యమంత్రి కర్నూలుకు రానున్న నేపధ్యంలో రాయలసీమలో మిగిలిపోయిన, రాయలసీమకు చెందిన కొందరు నేతలు కోరుతున్న దొనకొండ ప్రాంతాలలో కమిటీ పర్యటిస్తుండడం విశేషమే!
కమిటీ చేస్తున్న ఈ పర్యటన కంటి తుడుపు చర్యగా కాకుండా, నిర్మాణాత్మకంగా ఉండాలని కోరుకందాం..! శ్రీభాగ్ ఒప్పందం అమలు దిశగా రాజధాని ఎంపిక చేయాలని కమిటీకి జిల్లా వాసులు, అధికారులు తెలియచేయాల్సిన అవసరం ఉంది.