కడప మీదుగా శబరిమలకు మొత్తం మూడు ప్రత్యేకరైళ్లు, ఒక రోజువారీ రైలు నడుస్తున్నాయి. ఆ రైల్ల వివరాలు….
అకోల జంక్షన్ – కొల్లాంల మధ్య నడిచే 07505 నంబరు గల ప్రత్యెక రైలు అకోల నుంచి ప్రతి శనివరం బయలుదేరి కడపకు ఆదివారం ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది.
ఆదిలాబాద్ – కొల్లాంల మధ్య నడిచే 07509 నంబరు గల ప్రత్యేక రైలు కడప మీదుగా వెళుతుంది. ప్రతి శనివారం ఆదిలాబాద్ నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 7 గంటలకు కడప రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది.
నిజామాబాద్ – కొల్లాంల మధ్య వారానికి రెండు సార్లు నడిచే 07613 నంబరు గల ప్రత్యేక రైలు కడప మీదుగా వెళుతుంది. నిజామాబాద్ నుంచి కొల్లాలంకు ప్రతి బుధ, శుక్రవారాల్లో బయలుదేరే ఈ రైలు కడపకు గురువారం, శనివారం రాత్రి 12.20 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు కామారెడ్డి, కాచిగూడ, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు, గుత్తి, తాడిపత్రి, కొండపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కడప మీదుగా ఎర్నాకులం, కొట్టాయం, కోల్లాలంకు చేరుకుంటుం
కొల్లాం – నిజామాబాద్ ల మధ్య వారానికి రెండు సార్లు నడిచే 07614 నంబరు గల రైలు వెళుతుంటుంది. ప్రతి గురు, శనివారాల్లో కొల్లాం నుండి బయలుదేరే ఈ రైలు కడపకు శుక్రవారం, ఆదివారం సాయంత్రం 6 గంటలకు చేరుకుంటుంది.
పైన తెలిపిన రైల్లే కాకుండా కడప మీదుగా ప్రతిరోజూ కన్యాకుమారి వెళ్ళే రైలు (నెం.16381) కూడా కొల్లాం మీదుగా వెళుతుంది.