భద్రత తొలగింపుపై హైకోర్టుకు వెళ్లిన వై.ఎస్.కుటుంబం

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిల, అల్లుడు అనిల్ కుమార్ లు తమ భద్రత కోసం కోర్టుకు వెళ్లవలసి వచ్చింది. తమకు ఉన్న ప్రాణ హానిని పరిగణనలోకి తీసుకోకుండా తమకు ఉన్న సెక్యూరిటీని ప్రభుత్వం ఉపసంహరించిందని వారు ముగ్గురు హైకోర్టు ను ఆశ్రయించారు.

తాను ఇప్పటికే ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాసినా స్పందించలేదని, తనకు ఉన్న 2 ప్లస్ 2 భద్రతను పునరుద్దరించాలని విజయమ్మ కోరారు.

గత ఎన్నికల వరకు విజయమ్మ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా షర్మిల, అనిల్ కూడా అదే రీతిలో కోర్టుకు వెళ్లారు.

చదవండి :  'రాయలసీమ సంగతేంటి?'

తెలుగుదేశం ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత కుటుంబానికి కూడా భద్రత తగ్గించడం విశేషం.

ఇదీ చదవండి!

వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ‘సీలింగ్ ఫ్యాన్’ గుర్తు

హైదరాబాద్: కడప లోకసభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ‘సీలింగ్ ఫ్యాన్‌’ను ఎన్నికల …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: