వైభవంగా ఎర్రదొడ్డిపల్లి పురిగమ్మ వేల్పు

    గాలివీడు: గాలివీడు మండలంలోని చీమలచెరువుపల్లి పంచాయతీ ఎర్రదొడ్డిపల్లిలో పురిగమ్మ వేల్పు శుక్ర, శనివారం ఘనంగా జరిగింది. 15 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ వేల్పునకు ప్రజలు భారీగా హాజరయ్యారు. శుక్రవారం రాత్రి వివిధ గ్రామాల నుంచి 12 నాణములు వేల్పులో పాల్గొన్నాయి. ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేశారు. శనివారం సాయంత్రం నిర్వహించిన దేవతా నాణములతో నీలకర్త కార్యక్రమం, పూజ, గందోడి కోలలాడే సంబరాలు,. బాణసంచా పేల్లుళ్లు, వివిధ వాయిద్యాలతో చేసిన భజన ఆకట్టుకున్నాయి. నాణములతో పాలు దేవర ఎద్దులను పోటాపోటీగా అలంకరించి పురిగమ్మ ఆలయం వరకు పరుగులు తీశారు. లక్కిరెడ్డిపల్లి సీఐ సుధాకర్‌ ఆధ్వర్యంలో నలుగురు ఎస్సైలు, 50 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు పర్యవేక్షించారు. పరుగుల పోటీలో తొక్కిలాట జరుగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.

    చదవండి :  పంటల సాగు వివరాలు - కడప జిల్లా

      సంపాదకుడు

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *