వైఎస్ఆర్ కాంగ్రెస్­ ప్లీనరీ విశేషాలు

    విద్యపై ఎపిపిఎస్­సి మాజీ సభ్యుడు బిఆర్­కెరాజు తీర్మానం ప్రవేశపెట్టారు. విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చాలని ఆయన కోరారు. అందుకోసం రాజ్యాంగ సవరణ తీసుకురావాలన్నా రు. విద్యారంగంలో సమూల మార్పులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుడుతుందని చెప్పారు. డిగ్రీ తరువాత భవిష్యత్­పై మరింత దృష్టి పెట్టాలన్నారు. సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా ఉందని ఆయన అన్నారు. విద్యారంగంలో సమగ్ర ఆలోచన, విధానల రూపకల్పనకు పార్టీ తరపున ప్రత్యేక సదస్సు నిర్వహించవలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

    చదవండి :  'పట్టిసీమ' పేరుతో సీమను దగా చేస్తున్నారు

    

    పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుగా ప్రజా ప్రస్థానం వేదికపై ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ అమర్ హే అనే నివాదాలతో ప్లీనరీ ప్రాంగణం మార్మోగింది.

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *