ఉద్దేశపూర్వకంగా జిల్లాను ఘోరీ కడుతున్నారు

విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో శాసనసభ్యులు

మౌనముద్ర దాల్చిన కలెక్టర్

కడప: జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు అవసరమని కమిటీ ఛైర్మన్, ఎంపీ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు, కేటాయింపులు, నిధుల వినియోగం, ప్రజలకు చేరువపై సమీక్షించడానికి బుధవారం సభాభవన్‌లో నిర్వహించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కమిటీ ఛైర్మన్‌గా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి,  కార్యదర్శి హాదాలో జిల్లా కలెక్టర్ వెంకటరమణ, సభ్యులుగా జడ్పీ ఛైర్మన్ గూడూరు రవి, 8 మంది వైకాపా ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ హెల్త్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ఛైర్మన్‌గా తనను కేంద్ర ప్రభుత్వం నియమిస్తే రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను ఎలా సిఫార్సు చేస్తారని కలెక్టర్‌ను ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎంపీనే నియమిస్తే ఇక్కడ రాజ్యసభ సభ్యులను నియమించడంలో ఆంతర్యమేంటన్నారు. అందుకు కలెక్టర్ సమాధానమిస్తూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఇచ్చిందని ప్రభుత్వ ఆదేశం మేరకు తాను చేశానేగాని సొంతంగా చేయలేదన్నారు.

అవినాష్ మాట్లాడుతూ క్షేత్రసహాయకుల కమిటీల ఎంపికలో జన్మభూమి కమిటీ ప్రమేయం ఉండరాదని తీర్మానం చేసి పంపుదామని, ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. తాగునీటి పనులకు ఆలస్యం చేయడం సరికాదని తీర్మానిద్దామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తుల పేర్లు మంత్రికి ఎలా తెలుస్తాయని క్షేత్రసహాయకుల నియామకంపై నిలదీశారు. ఇక్కడ నుంచి ఎవరో ఒకరు చెబితేకాని ఆయనకు తెలియదన్నారు. అందుకు కలెక్టర్ బదులు చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు.

చదవండి :  'గంజి బువ్వ' కథా సంపుటి ఆవిష్కరణ

తాగునీటి పనుల అనుమతికి 75 రోజులుంటే ఆ లోపు ప్రజలు ఇబ్బంది పడతారన్నారు. చక్రాయపేట మండలంలో మంజూరైన చెక్‌డ్యాంల నిర్మాణానికి మార్కింగ్ ఇచ్చేందుకు అయిదు వారాల నుంచి తాను చెబుతున్నా పీఆర్ ఎస్ఈ, అధికారులు పట్టించుకోకపోడంపై ఆయన మండిపడ్డారు. తాఖీదులు ఇచ్చామంటున్నారు ఆ పత్రాలు చూపాలని కోరగా ఎస్ఈ స్పందించలేకపోయారు. ఆ పనుల్లోనూ కమీషన్ కోరుతూ పనులను ఆపేయాలని చూడటం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. 3లోపు మార్కింగ్ ఇచ్చి పనులు ప్రారంభించకపోతే జడ్పీ సమావేశంలో ప్రస్తావించాల్సి వస్తుందన్నారు. దీనిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాకు వచ్చిన రూ. 50 కోట్లు ప్రత్యేక నిధులు తాగునీటికే ఖర్చుచేయాలని తీర్మానం చేద్దామని పేర్కొన్నారు. జన్మభూమి కమిటీ ఎంపికలో అర్హులకు జరిగిన అన్యాయం, కమిటీలను రద్దు చేయాలని కోరుతూ సమావేశం ద్వారా తీర్మానం చేయాలన్నారు. పొన్నతోట ఇసుక క్వారీ అనుమతి ఇవ్వరాదని పేర్కొన్నారు.

ఎస్సీ,ఎస్టీ కాలనీల్లో విద్యుత్తు యూనిట్లు 50 నుంచి 150కి పెంచాలని తీర్మానం చేయాలని చెప్పగా కలెక్టర్ అందుకు ఈ కమిటీ అందుకు వేదిక కాదన్నారు.

కడప శాసనసభ్యుడు అంజద్‌బాష మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యకార్యదర్శిని అయిదు నిమిషాల్లో కలుస్తున్నాం. జిల్లా కలెక్టర్‌ను కలవాలంటే వారం పడుతోందని ఆరోపించారు. ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులకే దిక్కులేకపోతే సామాన్య ప్రజల సంగతేంటన్నారు. రిమ్స్ అభివృద్ధి కమిటీలో కడప ఎమ్మెల్యేనైన తనను కాదని రాయచోటి ఎమ్మెల్యేను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు.

చదవండి :  6న అఖిలపక్షం కలెక్టరేట్ ముట్టడి

బద్వేలు ఎమ్మెల్యే జయురాములు మాట్లాడుతూ…గోవిందరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక ఒకసారి కలెక్టర్‌ను కలుద్దాం అనుమతి తీసుకోవాలని చెబితే.. సీసీతో మాట్లాడా. సాయంత్రం 5.30లకు ఇస్తే ప్రజాప్రతినిధి అంత వరకు కడపలోనే ఉండాలాని ప్రశ్నించారు. అధికారులనెవరిని తప్పు పట్టడంలేదని కేవలం ప్రజాప్రతినిధులంటే గిట్టని కలెక్టర్‌పైనే మాట్లాడుతున్నామన్నారు.

జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ జిల్లా అని ఉంటే వైఎస్ఆర్ అనే పేరును దిద్ది పెడతారట, గీకి కొట్టిపారేస్తారట, ఆ అధికారం మీకెవరిచ్చారండి, ఇసుక లేనిచోట ఇసుక ఎత్తుతున్నారు. మాకు తెలియదనుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఏసీలో కూర్చుని మనం శుద్ధినీరు తాగుతున్నాం, ప్రజలకు మనం మంచినీరైనా ఇవ్వకపోతే ఎలాగని ఆయన ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా జిల్లాను ఘోరీ కడుతున్నారన్నారు. ఒక ఎంపీడీవో ఆత్మహత్యాయత్నం చేసేలా చేశారని, జడ్పీ ఛైర్మన్ ఎస్సీ అభ్యర్థిని తక్కువగా చూస్తున్నారని ఆరోపించారు.

కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాథ్‌రెడ్డి  మాట్లాడుతూ జన్మభూమి- మా వూరు కమిటీలో ఛైర్మన్ అయిన సర్పంచి, సభ్యులైన ఎంపీటీసీల సంతకం లేకున్నా పింఛన్లు ఎలా అనుమతిస్తున్నారంటూ ప్రశ్నించారు. జిల్లా యంత్రాంగం టీడీపీకి కొమ్ము కాస్తోందని విమర్శించారు. కమలాపురం పరిధిలో బాగున్న 19 వాటర్‌షెడ్లను పగలకొట్టి మళ్లీ పనులు చేశారన్నారు. రూ. 150 కోట్లు ఉపాధి నిధులు జిల్లాకు తెచ్చుకోవడంలో అధికారులు విఫలమయ్యారన్నారు.

చదవండి :  5వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు ఎప్రిల్ 2 చివరి తేదీ

రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ…డీలర్ల నియామకంలో రాయచోటికి సంబంధించిన ప్రశ్నపత్రాలను లీక్ చేయడమేంటని నిలదీశారు. ఇష్టమైన వారికి పత్రాలు ఇచ్చేసేరన్నారు. రాజకీయాలు మారుతుంటాయని అధికార వ్యవస్థ నిక్కచ్చిగా ఉండాలన్నారు. తమ పార్టీ వారు బోరుబావులు తవ్వాలంటే వాల్టా ఉంటుందని అదే రాజ్యాంగ శక్తులు తవ్వాలంటే చట్టం ఉండదాని ప్రశ్నించారు. మంజూరైన మరుగుదొడ్లుకు ప్రజలు ముందుకు వస్తున్నాఅధికారులు స్పందించడంలేదన్నారు. పింఛన్లు తీసుకునే ముసలోళ్లతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు.

మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి మాట్లాడుతూ పింఛన్ల మంజూరులో తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకునే దమ్ము అధికార యంత్రాంగానికి ఉందా అని ప్రశ్నించారు. తన నియోజవర్గంలో అనర్హులకు పింఛన్లు ఇచ్చారని, కొందరైతే ఇతరులు రేషన్‌కార్డు పెట్టుకుని పించన్ మంజూరు చేయించుకున్నారన్నారు. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటే తన వద్ద ఉన్న నివేదిక అధారాలు ఇస్తానన్నారు. అందుకు కలెక్టర్ ప్రభుత్వ యంత్రాంగంతప్పు చేసింటే చర్యలు తీసుకుంటామని, అనధికారులైతే నియమించిన వారికి నివేదిస్తామని సమాధానం ఇచ్చారు. కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు.

రైల్వే కోడూరు శాసనసభ్యుడు..శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో తాగునీటితో ప్రజలు అవస్థలు పడుతుంటే పనులు చేసేందుకు ఆంక్షలు విధించడమేంటని అన్నారు. ఎక్కడా ఇలాంటి దుస్థితిలేదని జిల్లాలోనే ఉందన్నారు.

సమావేశంలో ఎంపీపీలు, డ్వామా, ఆర్‌డబ్ల్యూఎస్, పీఆర్ ఎస్ఈలు, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

‘వాస్తు కోసం దక్షిణ ద్వారం మూయండి’: కలెక్టర్

ఒంటిమిట్ట: వాస్తు రీత్యా దక్షిణద్వారం అనర్థదాయకం కావడంతో కోదండ రామాలయ దక్షిణ ద్వారాన్ని మూసి వేయాలని జిల్లా సర్వోన్నత అధికారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: