విజయమ్మకు 81వేల 373 ఓట్ల మెజార్టీ

పులివెందుల : పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ఘన విజయం సాధించారు. తొలి రౌండ్‌ నుంచే ఆధిక్యంతో కొనసాగిన విజయమ్మ ఆమె తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిపై 81వేల 373 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ విజయమ్మ భారీ మెజార్టీ సాధించి రికార్డు బద్దలుకొట్టారు. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన బిటెక్ రవి(ఎం.రవీంద్రనాధ్ రెడ్డి) ధరావతు కోల్పోయారు.

చదవండి :  15, 16న నామినేషన్ వేయనున్న జగన్, విజయలక్ష్మి

పులివెందుల నియోజకవర్గంలో పోలైన ఓట్ల వివరాలు:

విజయమ్మ- 1,10,102
వైఎస్ వివేకానందరెడ్డి – 28,729
బిటెక్ రవి – 12,051

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *