వాహిని సినిమా హాలు

అనంత జనవాహినిలో నువ్వెంత?

అది అనంతపురం జిల్లాలోని తాడిపత్రి…కరువుసీమ అయినా కురిసే ఆ కాస్త వర్షంతోనే సిరులు పండించగల రైతులు…బ్రిటిష్ వారు వేసిన మద్రాస్-బొంబాయి రైలు మార్గంలో ఉండే ఆ ఊరునుంచి ఎందరో వ్యాపారాలూ చేసారు….

ఆ ఊరునుంచి వచ్చిన మూలా నారాయణ స్వామి,పక్కనున్న కడప జిల్లాకు చెందిన బి.ఎన్.రెడ్డి తో కలిసి మద్రాస్ లో వాహినీ స్టుడియోస్ స్థాపించారు…ఆ తర్వాత ఆ తాడిపత్రిలోని పెన్నేటి ఇసుకలో ఆడుకుని madras presidensy college లో B.Sc(hons) Gold medalist K.V.రెడ్డి వీరితో కలిసాడు….ఇక “చిత్తూరు”నాగయ్యతో ఎన్నో సూపర్డూపర్ హిట్ సినిమాలు….రాయలసీమ వారు తీసిన భక్త పోతన సినిమా చూసి కోనసీమలోని ఒక దళిత బాలుడు బాలయోగిగా మారాడు…ఆ తర్వాత తీసిన యోగి వేమన ను గొప్పగా ఆదరించలేదు…..మేము నచ్చిందా?జనాలకు నచ్చిందేఆ వారికివ్వాల్సింది అనే మీమాంస…

అప్పుడొచ్చాడు కోటేరు ముక్కున్న కొత్త అందాల నటుడు…నెల జీతానికి వారి కంపెనీలో చేరాడు…సాహసం శాయరా డింబకా అంటూ పాతాళ భైరవి మొదలు పెట్టారు…ఇక హీరో పాత్రకోసం కసరత్తులు చేయాల్సి వచ్చేది….కంపెనీ క్యాంటీన్ లో టోకెన్లు ఇస్తే తిఫ్ఫిన్,భోజనాలు ఇచ్చేవారు…అది సరిపోవటం లేదు మరో రెండు ఇడ్లీలు,వడలు కోరుకున్నాడు ఆ హీరో…సరేనన్నారు…

ఆ సినిమా సూపర్డూపర్ హిట్….ఒక చిన్న పాటలో అంతకుముందు హీరోయిన్ గా రిజెక్ట్ అయిన సావిత్రి కనిపించింది…ఆ తర్వాత వాహినీ వారు విజయా స్టుడియోగా మారాక తీసిన పెళ్లి చేసి చూడులో కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది…ఇక పాటాళ భైరవి లో కడపజిల్లాకు చెందిన పద్మనాభం కూడా సదాజపుడు వేషం వేసాడు…ప్రముఖ హాస్య నటుడిగా వెలుగొంది ఆ సినిమా హీరో NTR తో దేవత సినిమా,తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తో శ్రీరామ కథ లాంటి సినిమాలు తీసాడు…కథానాయిక మొల్ల అంటూ రామాయణ రచయిత్రి జీవితగాధనూ తీసాడు…అంతెందుకు గాన గంధర్వుడు s.p.బాలసుబ్రహ్మణ్యం కు గాయకుడిగా శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్నలో అవకాశం ఇచ్చాడు….

చదవండి :  హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? - రెండో భాగం

ఇక ఆ తర్వాత K.Vరెడ్డి గారు తీసిన సత్యహరిశ్చంద్ర తో హాస్య చక్రవర్తి రాజబాబు గుర్తింపు తెచ్చుకున్నాడు…

ఇక మాయాబజార్ సంగతి చెప్పాలా?ఈ రోజుకూ సిని విమర్శకులు మాయాబజారా?B.Nరెడ్డి గారి మల్లీశ్వరా,ఏది గొప్ప సినిమా అని వాదోపవాదాలు చేసుకుంటూనే ఉన్నారు….

ఇక మాయాబజార్ ను అంతకుముందు అంటే తొలి టాకీలొచ్చిన రోజుల్లో శశిరేఖా పరిణయం అంటూ తీసారు…ఘటొత్కచుడిగా నంద్యాల ప్రాంతానికి చెందిన రామిరెడ్డి…వీరు యోగి వేమనలో వేమన అన్నగా నటించారు…నిజానికి పాతాళ్లభైరవిలో నేపాళ మాంత్రికుడిగా వీరినే తీసుకున్నా ఆస్త్మా ఉన్నందున గడ్డాలు పెట్టుకుని నటించనంటే ఆ పాత్ర S.V.రంగారావు కు దక్కింది….ఇక ఆ సినిమాలో శశిరేఖగా నటించిన singing star శాంతకుమారిది కడప జిల్లా ప్రొద్దటూరు సమీప గ్రామం…ఆ తర్వాత పద్మశ్రీ బానర్ మీద ఎన్నో సినిమాలు తీసారు…సినీ పరిశ్రమలోని వారు ఆవిడను,వారి భర్త పి.పుల్లయ్యలను అమ్మా,నాన్నా అని పిలిచేవారు..వారేమో అక్కినేనిని అబ్బీ అని పిలిచేవారు….

ఇక అంతకుముందు కృష్ణుడిగా ఒక సినిమాలో NTR నటిస్తే ఛీ కొట్టిన జనాలు మాయాబజార్ తర్వాత నీరాజనాలు పట్టారు..ఇక శాంతకుమారి గారి శ్రీ వేంకటేశ్వర మహత్యం చూసి వెంకటేశ్వరుడిగా NTR ను ఆరాధించారు….

చదవండి :  పదిమంది నాయకులకంటె పది అడుగుల ఎత్తున ...

ఇక ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన NTR ఏం చేసాడు?పాత టాక్స్ పద్దతినిని తీసి స్లాబ్ పద్దతి పెట్టాడు…అప్పటికది గొప్ప ఫలితాలనిచ్చింది..ఆ దెబ్బతో హీరోలకు stardom వచ్చి వారి సినిమాలే ప్రదర్శించే పరిస్థితి వచ్చింది….ఆ తర్వాత ఇంటింటికీ వినోదం వచ్చింది…కానీ ఆ పరిణామాలు చూడకుండా అన్న గారు,ఆ తర్వాత వచ్చిన అల్లుడుగారూ అదేం పట్టించుకోకుండా ఆ పద్దతే కొనసాగించారు…చివరికి సినిమాహాల్లు షాపింగ్ కాంప్లెక్స్లుగా,గోడౌన్లుగా మారాయి….

పంపిణీదారులు మాయమయ్యారు..బయ్యర్లు వచ్చారు..దీని వల్ల అభిరుచి కలిగిన సినిమాలకూ కాలం చెల్లింది…… నిర్మాతలు క్యాషియర్లయ్యారు…..

ఈ రకంగా సినిమా హీరోగా వచ్చినాయన,తొలిసారి సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసిన మరొకాయన వల్ల సినీ పరిశ్రమకు ఎంతో నష్టం వాటిల్లింది….
ఇక ఇప్పుడో అర్ధనటుడు,అర్ధ మగాడు వచ్చి సంస్కృతి గురించి ఏవో వాగాడట…ఆ సన్నాసి సినిమాలు స్లాబ్ సిస్టం వచ్చాక అసలు ఆడనేలేదు…ఇప్పుడో నాయకుడైపోయాడు…పాపం వీరి నాయకుడు మామగారి పార్టీ గుర్తులు కొట్టేస్తే..మనోడో!సహనటుడు గిరిబాబు బ్యానర్ జయభేరి ని కొట్టేసాడు….ఆ తర్వాత సినిమాలు తీసాడు..చీదేసాయి…..

ఆ తర్వాత మణిరత్నం ఇద్దరు సినిమాను 3 కోట్లు పోసి తెలుగు హక్కులు సంపాదిస్తే దారుణ పరాజయం….అప్పులెగ్గొట్టి పోయాడు….మళ్లీ బాబుకు బినామీ అవతారమెత్తాడు….

అయినా మా సంస్కృతి గురించి వాగే సన్నాసీ,నీ సంస్కృతేం గొప్ప?మీ ఏలూరు పేటలు,ఆ పక్క వేల్పూరులో హంసమేడలు,కంపెనీల కథ జనాలకు తెలీదనుకున్నావా?

అసలు మీ ఏలూరు contribution ఏముంది నీకు కూడు పెట్టిన సినిమా రంగానికి…మీరిచ్చింది ఒక్క సిల్క్ స్మితనే…. నువ్వో శిఖండివని మీ పరిశ్రమ జనాలే చెబుతారు….

చదవండి :  వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత..

అవున్రోయ్ అన్నగారికి బృహన్నల వేషం ఇచ్చి సెహబాష్ అనిపించిన నర్తనశాల నిర్మాత లక్ష్మీరాజ్యందీ మా రాయలసీమేరోయ్…..ఆ మధ్య మీ నాయకుడు కాల్వనిద్ర చేసాడే…గాలేరు-నగరి,SRBC ల రిజర్వాయరున్న ఔక్ గ్రామమే ఆవిడది….

అంతేనా బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి మా కర్నూలు జిల్లా కోడలే…వారి భర్త,ప్రముఖ దర్శకుడు రామకృష్ణ గారిది మా జిల్లానే…ఆవిడ అత్తగారి కథల్లో అత్తగారు మా ఆడపడుచే…

ఇదుగో మీ నాయకుల తీరువల్ల దుంపనాశనమైన ఒక సినిమా హాల్….ఇదేదో తెలుసా?ఆ తాడిపత్రి పెన్న ఒడ్డునున్న..ఒక నాటి మీ నాయకుడికి నెలజీతం ఇచ్చిన యజమానికి చెందిన “వాహిని” సినిమా హాల్…..

అనంత జీవనవాహినిలో నువ్వెంత?నీ బతుకెంత?

– గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

రచయిత గురించి

సాహిత్యాభిలాషి అయిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అనేక ప్రదేశాలలో పర్యటించి అయా విశేషాలను వివిధ పత్రికలలో వ్యాసాలుగా రాసినారు. ఆయా యాత్రా విశేషాలకు చరిత్ర, సంస్కృతులకు సంబంధించిన అరుదయిన విషయాలను జోడించి చెప్పటంలో వీరు నేర్పరి. వీరు భారతదేశంలోని అనేక పర్యాటక ప్రాంతాలనే కాక ఈజిప్టును కూడా సందర్శించినారు. ఈజిప్టుకు సంబంధించిన వీరి యాత్రా విశేషాలను ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ఆదివారం అనుబంధంలో ముఖచిత్ర కథనంగా ప్రచురించింది. రాయలసీమ అభ్యున్నతిని కాంక్షించే వీరు సీమ సమస్యలపైన వివిధ మాధ్యమాలను వేదికగా చేసుకుని గళం విప్పుతున్నారు. కర్నూలు జిల్లాలోని నంద్యాల వీరి స్వస్థలం.ఫోన్ నంబర్: +91 – 9505221122

ఇదీ చదవండి!

రాయలసీమపై టీడీపీ

రాయలసీమపై టీడీపీ కక్ష తీర్చుకుంటోంది : బిజెపి

కడప : రాయలసీమ కోసం తెలుగుదేశం నేతలు దొంగ దీక్షలు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్థన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: