వాన జాడ లేదు – సేద్యానికి దిక్కు లేదు

18 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం

జిల్లా వ్యాప్తంగా సకాలంలో వర్షం రాక పోవడం, వచ్చినా పదును కాకపోవడంతో సేద్యాలు చేసుకోలేక రైతులు వాన కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్‌ పంటకు అను వైన జూన్‌, జులై నెలల్లో జిల్లాలో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదైంది. నాలుగు నెలల్లో 393.5 మిల్లి మీటర్ల వర్షపాతం జి ల్లాలో నమోదు కావాల్సి ఉండగా 180.6 మిల్లి మీటర్లు మాత్రమే నమోదైంది. వాస్తవికంగా 54 శాతం తక్కువ వాన పడినట్లు అధికారిక గణంకాలు చెబుతున్నాయి.

చదవండి :  గంగమ్మను దర్శించుకున్న నేతలు

జూన్‌లో 69.2 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు కా వాల్సి ఉండగా 46.7 మిల్లి మీటర్లు, జులైలో 96.7 మి.మి.ల గాను 40.1మి.మిలు, ఆగస్టు నెలలో 114 మిల్లి మీటర్లకు గాను 79.7 మిల్లి మీటర్లు, సెప్టెంబర్‌ నెలలో 113.7 మి.మి గాను ఇప్పటి వరకు 14 మి.మి మాత్రమే వాన మోదైంది.

జిల్లాలోని 18 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. కోడూరు, ఓ బులవారిపల్లె మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. కడప, వల్లూరు, పెండ్లిమర్రి, సి.కె.దిన్నె, చెన్నూరు, కమలాపురం, ఎర్రగుంట్ల, రాయచోటి, చిన్న మండెం, టి. సుండుపల్లె, చక్రాయపేట, రాజంపేట, నందలూరు, పుల్లంపేట, చిట్వేలి, పోరుమామిళ్ళ, బి. కోడూరు, బద్వేలు, కలసపాడు, కాశినాయన, అట్లూరు, జమ్మలమడుగు, మైలవరం, పెద్ద ముడియం, ముద్దనూరు, కొండాపురం, ప్రొద్దుటూరు, చాపాడు, మైదుకూరు, లింగాల, వేంపల్లె మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది.

చదవండి :  'రాక్షస పాలన కొనసాగుతోంది' - సిఎం రమేష్

రామాపురం మండలంలో 86 శాతం, తొండూరు 82, రాజుపాలెం 78, సింహాద్రిపురం 74, దువ్వూరు 72, విఎన్‌పల్లె 72, గాలివీడు 71, ఖాజీపేట 69, ఎల్‌ఆర్‌ పల్లె 68, పెనగలూరు 67, గోపవరం 66, సంబేపల్లె 65, వేముల 63, బి.మఠం 62, సిద్దవటం 62, ఒంటిమిట్ట 62, వీరబల్లి 61, పులివెందుల మండలంలో 60 శాతం మేరా సగటు వర్షపాతం నమోదైంది.

జిల్లా వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్ధితులు నెలకొనడంతో అంతంత మాత్రమే సాగు చేశారు. కెసీ కెనాల్‌కు నీరు రావడంతో కొంత చోట మాత్రమే వరి సాగైంది. వర్షాధారంగా పంటలు సాగయ్యే భూములు బీళ్లు గానే దర్శనమిస్తున్నాయి. సకాలంలో వర్షం రాక పోవడం, వచ్చినా పదును కాకపోవడంతో సేద్యాలు చేసుకోలేక రైతులు వాన రాక కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు.

చదవండి :  కనుల పండువగా కోదండరాముని రథోత్సవం

ఖరీఫ్‌ కనికరించకపోయినా రబీ అయినా అదుకొంటుందనే ఆశాభావంతో రైతులున్నారు.

ఇదీ చదవండి!

సౌమ్యనాథస్వామి ఆలయం

తితిదే కిందకు సౌమ్యనాథస్వామి ఆలయం

కడప : నందలూరు సౌమ్యనాథస్వామి దేవాలయాన్ని తితిదేలోకి విలీనం చేసినట్లు రాజంపేట ఎమ్మెల్యే, తితిదే పాలక మండలి సభ్యుడు మేడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: