తెదేపా జిల్లా అధ్యక్షునికి బాబు పోటు

lingareddyతెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు – జిల్లా నుండి గెలిచిన ఏకైక తెదేపా ఎమ్మెల్యే లింగారెడ్డి ప్రొద్దటూరు టిక్కెట్ విషయంలో వెన్నుపోటుకు గురయ్యారు.

సుదీర్ఘ కాలం తెదేపాను అంటిపెట్టుకొన్న లింగారెడ్డిని కాదని కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి బాబు ప్రొద్దుటూరు టికెట్ కేటాయించారు.

ఈ విషయం తెలిసీ లింగారెడ్డి ఇంటి వద్ద టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. పార్టీ సింబర్‌ సైకిల్‌ను సైతం మంటల్లో వేశారు. సీఎం రమేష్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

చదవండి :  రాయచోటి శాసనసభ స్థానంలో ఎవరికెన్ని ఓట్లు?

సీఎం రమేష్ ఈ కుట్రకు సూత్రధారి అని… వరదరాజుల రెడ్డి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని ఆయనకు టికెట్ కేటాయించారని లింగారెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. 

ఈ విషయమై ఒక టీవీ చానల్ తో ఫోనులో మాట్లాడిన లింగారెడ్డి చంద్రబాబును విమర్శించకుండా కేవలం సిఎం రమేష్ వల్లే ఇలా జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. నా దగ్గర డబ్బు లేదు కాని ఆస్తులున్నాయన్న లింగారెడ్డి డబ్బే కావాలంటే మూత్రపిండాలు అమ్మి అయినా ఇస్తా అంటూ ఉద్వేగానికి గురయ్యారు. తెదేపా కోసమని వైకాపా ఆఫర్ ను సైతం వదులుకున్నానని ఆయన వాపోయారు. టిక్కెట్ విషయంలో చంద్రబాబు పునరాలోచన చేయాలని లేని పక్షంలో తీవ్రనిర్ణయం తీసుకోనేదానికి సిద్ధమని లింగారెడ్డి హెచ్చరించారు.

చదవండి :  కడప జిల్లా తెదేపా నేతలు నోరు మొదపరేం?

కనుసైగతో పార్టీని శాసిన్చగలిగిన బాబు గారికి తెలియకుండా, వారి ప్రమేయం లేకుండా టికెట్ల కేటాయింపులో మార్పులు చోటు చేసుకుంటాయా… అయినా సిఎం రమేష్ చెప్పగానే అవునని తలూపే అమాయకుడా చంద్రాబాబు!

ఇదీ చదవండి!

పోతిరెడ్డిపాడును

పట్టిసీమ డెల్టా అవసరాల కోసమే : నిజం చెప్పిన చంద్రబాబు

కడప : ఇన్నాళ్ళూ పట్టిసీమ రాయలసీమ కోసమేనని దబాయిస్తూ అబద్దాలాడుతూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్టకేలకు నిజం చెప్పారు. పట్టిసీమ …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: