డిఎన్ నారాయణ

రైతు నేత డిఎన్ నారాయణ ఇక లేరు

కృష్ణాపురంలో అంత్యక్రియలు

మైదుకూరు: రాయలసీమ రైతాంగ మౌలిక సమస్య లపై తనదైన రీతిలో పోరాటం సాగించిన మైదుకూరు రైతుసేవా సంఘం అధ్యక్షుడు

డిఎన్ నారాయణ
డిఎన్ నారాయణ

డి.యన్.నారాయణ(63) శనివారం ఉదయం మైదుకూరులో మరణించా రు. నారాయణకు రెండేళ్ల కిందట గుండె శస్త్ర చికిత్స జరిగింది. రెండు రోజుల కిందట అస్త్వస్థతకు గురి కావడంతో తిరుపతికి తరలించారు. అక్కడ ఆరోగ్య పరిస్ధితి పూర్తిగా క్షీణించింది. నారాయణ అపస్మారక స్ధితిలోకి వెళ్ళిపోవడంతో  ఇంటికి తీసుకు వెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయనను శుక్రవారం రాత్రి తిరుపతి నుండి మైదుకూరుకు తరలించి డాక్టర్ బద్వేలు సుబ్బరాయుడు ఆసుపత్రిలో చేర్చారు. నేటి ఉదయం అక్కడే ఆయన తుదిశ్వాస వదిలారు.

చదవండి :  పాలకవర్గాలు ఏర్పడినాయి!

కె.పి ఉల్లి, కె.సి.కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు రైతులకు సాగునీటి విషయంలో ఎన్నో ఉద్యమాలు చేశారు. మూడు దశాబ్దాల పాటు రైతు నాయకులు కీ.శే.ఎం.జె సుబ్బరామిరెడ్డి, లెక్కల వెంకటరెడ్డి, గోశెట్టి వెంకటరమణయ్య, బిపి ప్రతాప్ రెడ్డి , పోలు కొండారెడ్డి, కీ.శే.ఎ.శంకరరెడ్డి, కీ.శే .విటిఎస్ నరసింహాచారి, అంకిరెడ్డిపల్లె నారాయణ రెడ్డి తదితరులతో కలసి మైదుకూరు కేంద్రంగా నారాయణ రైతు ఉద్యమాలే ఊపిరిగా కొనసాగారు. మైదుకూరు రైతు ఉద్యమాలలో నారాయణ వేసిన ముద్ర చెరగనిది.

అశ్రునివాళి:

మైదుకూరు రైతు సేవా సంఘం అధ్యక్షుడు డిఎన్ నారాయణ భౌతిక కాయానికి అశ్రునివాళుల మధ్య శనివారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. నారాయణ స్వగ్రామమైన కృష్ణాపురంలో జరిగిన ఆయన అంతిమ యాత్రలో వివిధ రైతుసంఘాల ప్రతినిధులు, రాజకీయ నాయకులు , కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ ప్రజలు , రైతులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.

చదవండి :  యోగి వేమన విశ్వవిద్యాలయానికి యూజీసీ 12-బీ గుర్తింపు

మూడు దశాబ్దాలపాటు మైదుకూరు కేంద్రంగా రైతు సమస్యలపై నారాయణ అలుపెరుగని పోరాటం చేసారని అంత్యక్రియల్లో పాల్గొన్న రైతు ప్రతినిధులు కొనియాడారు. తెలుగు దేశం రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బా రెడ్డి, సోషలిస్టు అభియాన్ కన్వీనర్ , కవి లెక్కల వెంకటరెడ్డి, బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు బిపి ప్రతాప రెడ్డి , రైతు సంఘాల సమాఖ్య కన్వీనర్ పోలు కొండా రెడ్డి, కేసి కెనాల్ రైతు సంఘం ప్రతినిధి జి. నాగిరెడ్డి, కథారచయిత, సీనియర్ పాత్రికేయుడు తవ్వా ఓబుల్ రెడ్డి , మైదుకూరు సిండికేట్ రైతు సేవా సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీమన్నారాయణ రెడ్డి, బి.కొత్తపల్లె మాజీ సర్పంచ్ జి. నాగిరెడ్డి , భారతీయ కిషాన్ సంఘ్ రాష్ట్ర నేత మాధవ రెడ్డి , బిజెపి నియోజక వర్గ నాయకుడు రామ సుబ్బారెడ్డి , తెలుగు సమాజం ప్రతినిధి, కళాకారుడు ఎ.వీరాస్వామి, ఎస్టీయు ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర నాయకుడు ఎ.పి. శ్రీనివాసులు తదితరులు డిఎన్ నారాయణ భౌతిక కాయానికి ఆకుపచ్చ వస్త్రం కప్పి ఘనంగా నివాళులు అర్పించారు.

చదవండి :  విమానాశ్రయం కథ మళ్ళా మొదటికే!

ఇదీ చదవండి!

ప్రాణుల పేర్లు

చిరుతపులిని తగులబెట్టిన రైతు

మైదుకూరు: మండలంలోని మిట్టమానుపల్లెకు చెందిన రైతు మూలే రామసుబ్బారెడ్డి తన పంటపొలాలను అడవి జంతువుల నుంచి రక్షించుకొనే నేపధ్యంలో తన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: