
‘రాయల తెలంగాణ’నూ పరిశీలిస్తున్నాం
పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సిఫారసు చేసినప్పటికీ.. రాయల తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదన కూడా ఆంటోనీ కమిటీ పరిశీలనలో ఉందని ఆ కమిటీ సభ్యుడు, కాంగిరేసు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ డిగ్గీ రాజా వెల్లడించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదనటం సరికాదన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రయోజనాలను కాపాడే విధంగా కాకుండా.. కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఎన్నికలకు ముందుగా హడావిడిగా నిర్ణయం తీసుకుందన్న వాదనను ఆయన తిరస్కరించారు.
జె.సి లాంటి వ్యాపార వేత్తలు తమ స్వప్రయోజనాల కోసం అందుకున్న ‘రాయల తెలంగాణా’ పల్లవిని డిగ్గీ రాజా అందుకోవడం వెనుక మతలబు కనిపించటం లేదూ! సీమ నాయకులారా, మేదావులరా గమనిస్తున్నారా!
సీమ ఉద్యమ నినాదం మారాల్సిన సమయమిది….
1 Comment
Digvijay sing or Sushma swaraj no need to believe them. They have broken states in pieces of lands for their party votes. Be a nationalist. But we do not have a third choice for the parliament. God bless us.