
ఈరోజు సీమ సాహితీవేత్తల సమాలోచన
రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయలసీమ భవితవ్యంపై కడప సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ఈ రోజు (ఆదివారం – 6వ తేదీన) నిర్వహించే సీమ స్థాయి కవుల, రచయితల , పాత్రికేయుల సమావేశానికి అందరూ తరలిరావాలని కుందూ సాహితి సంస్థ కన్వీనర్ లెక్కల వెంకటరెడ్డి తెలిపారు. స్థానిక సిపిబ్రౌన్ గ్రంధాలయంలో ఉదయం 10 గంటల నుంచి జరిగే ఈ సమావేశానికి కడప.ఇన్ఫో గౌరవ్సంపాదకులు, రచయిత తవ్వా ఓబులరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు.
రాష్ట్ర విభజనానంతర పరిణామాలు రాయలసీమకు వ్యతిరేకంగా రూపుదిద్దుకుంటున్నాయని రాజధాని ప్రాంత ఎంపిక, అభివృద్ధి ప్రణాళికలు కోస్తాంధ్ర ప్రాంతం చుట్టే తిరుగుతున్నఈ నేపథ్యంలో సీమ భవితవ్యం కోసం నిర్దిష్ట ప్రణాళికతో దిశా నిర్దేశం చేసేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు వెంకటరెడ్డి తెలిపారు.
కుందూ సాహితీ సంస్థవారు ప్రచురించిన కరపత్రం , మీ కోసం….