రాయలసీమ పరిరక్షణ సమితి ఆవిర్భావం

తిరుపతి : నాలుగు జిల్లాలకు చెందిన రిటైర్డు ఉద్యోగులు, ఇంజనీర్లు, విద్యార్థి నాయకులు, మేధావుల సమక్షంలో రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ ఆవిర్భవించింది.  రాయలసీమ రాష్ట్ర సాధనే లక్ష్యంగా రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని ఏర్పాటు చేసినట్టు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.  తిరుపతి ఇందిరా మైదానంలో గురువారం రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ ఆవిర్భావ సభ జరిగింది.

ఈ సందర్భంగా బెరైడ్డి మాట్లాడుతూ ఎక్కడి నుంచో వచ్చిన తెల్లదొరసాని నలుగురు పొరుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను వెంటపెట్టుకుని రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తోందని మండిపడ్డారు. ఇక్కడి రాజకీయ దొంగలేమో తమ జిల్లాను తెలంగాణ లో కలపాలంటూ నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

చదవండి :  విమానాశ్రయం కథ మళ్ళా మొదటికే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: