రాయలసీమ కన్నీటి గాథ – ఎం.వి.రమణారెడ్డి
ఎం.వి.రమణారెడ్డి గారు రాసి ప్రచురించిన ‘రాయలసీమ కన్నీటి గాథ’ ఈ-పుస్తకం. రాయలసీమ ఏ విధంగా వంచనకు గురయిందో తెలిపిన మొట్ట మొదటి పుస్తకం.
రాయలనాటి వైభవంతో రతనాలసీమగా ఖ్యాతినొందిన రాయలసీమ జిల్లాలు నేడు కటిక దారిద్ర్యానికి శాశ్వత చిరునామాగా మారిపోయాయి. ఒకప్పటి అన్నదాత, నేడు గుక్కెడు నీటికోసం దీనంగా ఎదురుచూస్తున్నాడు.
అంగళ్లలో రతనాలమ్మిన ఆ వైభవం రాయలతో పాటే గతించింది. ఆలనలేని నీటిపారుదల వసతులు, పాలనలేని రాయలసీమ ప్రజలు క్రమక్రమంగా శిథిలమౌతూ వచ్చారు.