రాయచోటిలో వైకాపా రికార్డు

రాయచోతిలో అత్యధిక మెజారిటీ సాధించిన పార్టీగా వైకాపా రికార్డు సృష్టించింది.  ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి… టీడీపీ అభ్యర్థి సుగవాసి బాల సుబ్రహ్మణ్యంపై 56,891 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. రాయచోటిలో కాంగ్రెస్ డిపాజిట్ కూడా దక్కించుకోలేదు.

రాయచోటిలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో సహా మొత్తం పోలైన ఓట్లు 1,59,201. అభ్యర్థికి ధరవతు రావాలంటే ఇందులో ఆరింట ఒక వంతు ఓట్లు అంటే 26,533 ఓట్లు దక్కాలి. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి రాంప్రసాద్‌రెడ్డి 25,344 ఓట్ల వరకు వచ్చి ఆగిపోయారు. మరో 1189 ఓట్లు వస్తే ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీకి కనీస పరువు దక్కేది.

చదవండి :  రేపు సాయి ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

రాయచోటి నియోజకవర్గ చరిత్రలో ఇంతటి ఘన విజయం మునుపెన్నడూ లేదు. ఫలితాల్లో తొలి రౌండులోనే 3,908 ఓట్లు ఆధిక్యతతో బోణీ మొదలుపెట్టిన శ్రీకాంత్‌రెడ్డి ప్రతి రౌండులోనూ ఆధిక్యత ప్రదర్శించారు. 8వ రౌండులో అత్యధికంగా 6,238 ఓట్లు మెజార్టీ సాధించారు.

ఇప్పటి వరకూ రాయచోటికి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యులు….

 • 1952 – Y ఆదినారాయణరెడ్డి
 • 1955 – Y. ఆదినారాయణరెడ్డి (కాంగ్రెస్)
 • 1962 – ఆర్.ఎన్.రెడ్డి (స్వతంత్ర)
 • 1962 – A. బలరామిరెడ్డి (కాంగ్రెస్)
 • 1967 – M. క్రిష్ణారెడ్డి (కాంగ్రెస్)
 • 1972 – M. హబీబుల్లా (కాంగ్రెస్)
 • 1978 – సుగవాసి పాలకొండ్రాయుడు (జనతా)
 • 1983 – సుగవాసి పాలకొండ్రాయుడు (స్వతంత్ర)
 • 1985 – మండిపల్లె నాగిరెడ్డి (కాంగ్రెస్)
 • 1990 – మండిపల్లె నాగిరెడ్డి (కాంగ్రెస్)
 • 1992 – మండిపల్లె నారాయణ రెడ్డి (కాంగ్రెస్)
 • 1994 –  మండిపల్లె నారాయణ రెడ్డి (కాంగ్రెస్)
 • 1999 – సుగవాసి పాలకొండ్రాయుడు (తెదేపా)
 • 2004 – సుగవాసి పాలకొండ్రాయుడు (తెదేపా)
 • 2009 – గడికోట శ్రీకాంత్ రెడ్డి (కాంగ్రెస్)
 • 2012 – గడికోట శ్రీకాంత్ రెడ్డి (వైకాపా)
చదవండి :  జమ్మలమడుగు పురపాలిక పీఠం వైకాపాదే

ఇదీ చదవండి!

అఖిలపక్ష సమావేశం

జిల్లా అభివృద్ధికి పోరుబాటే శరణ్యం: అఖిలపక్షం

మొత్తానికి కడప జిల్లాకు చెందిన నాయకులు జిల్లా అభివృద్ది కోసం సమాలోచనలు సాగించడానికి సిద్ధమయ్యారు. ఈ దిశగా అఖిలపక్షం గురువారం …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: