రాజీవ్‌యువశక్త దరఖాస్తులకు చివరి తేదీ జులై18

కడప : జిల్లాలోని నిరుద్యోగ యువత రాజీవ్‌యువశక్తి పథకం దరఖాస్తులను ఈ నెల 18వ తేదీలోపు పంపుకోవాలని స్టెప్ సీఈవో డి.మహేశ్వరరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తేలిపారు. స్వయం ఉపాధి పొందేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి చిన్న పరిశ్రమలు లేక సర్వీసింగ్ కేటగిరి పరిధిలోకి వచ్చే యూనిట్లు నెలకొల్పేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆయన తెలిపారు.

అభ్యర్థులు జిల్లావాసులై, వార్షికాదాయం రూ.50వేలు మించకుండా 18 నుంచి 35 సంవత్సరాల్లోపు వయస్సు కలిగి ఉండాలని పేర్కొన్నారు. 1976 జూలై 1 నుం చి 1993 జూన్ 30వతేదీలోపు జన్మించి ఉండాలని తెలిపారు.

చదవండి :  అమ్మాయిలను విక్రయించే ముఠా గుట్టు రట్టు !

పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ అయి ఉండాలని పేర్కొన్నారు. వ్యక్తిగత కే టగిరిలో యూనిట్ విలువ రూ.లక్షగా నిర్దేశించామని, 20 శాతం సబ్సిడీ, 70 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుని వాటా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

దరఖాస్తులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి లేదా మున్సిపల్ కార్యాలయం లేదా స్టెప్ కార్యాలయాల్లో ఉచితంగా పొందవచ్చని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక జూలై 3వవారంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

చదవండి :  దమ్ముంటే నా మీదకు రా? కడప నడిబొడ్డులో తేల్చుకుందాం ...

ఇదీ చదవండి!

రెక్కలు కథ

రెక్కలు (కథ) – కేతు విశ్వనాథరెడ్డి

కేతు విశ్వనాథరెడ్డి కథ – రెక్కలు ఆ ‘ముగ్గురూ ఖాకి దుస్తుల్లో ఉన్న ఆడపిల్లలని తెలుస్తూనే ఉంది, వాళ్ళ ఎత్తుల్ని …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: