
రాజంపేట పార్లమెంటు స్థానంలో ఎవరికెన్ని ఓట్లు
కడప జిల్లాలోని రాజంపేట లోక్‌సభ స్థానం నుండి వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి గెలుపొందారు. ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్, బీజేపీ, తెలుగుదేశం పార్టీల తరపున ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీచేశారు. రాజంపేట లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసిన అభ్యర్తులకు దక్కిన ఓట్ల వివరాలు…
మిథున్ రెడ్డి పి.వి – వైకాపా – 601752 (52.23%)
పురందేశ్వరి దగ్గుబాటి – భాజపా + తెదేపా – 426990 (37.06%)
ముజీబ్ హుస్సేన్ – జైసపా – 59777 (5.19%)
సాయిప్రతాప్ ఏ – కాంగ్రెస్ – 29332 (2.54%)
నరేంద్రబాబు ఎస్ – మహాజన సోషలిస్ట్ పార్టీ – 15086 (1.30%)
వెంకట సుబ్బయ్య ఎన్ –బసపా – 8189 (0.71%)
ఎన్ దేవ – హిందుస్తాన్ జనతా పార్టీ – 3896 (0.33%)
వి పట్టాభి – స్వతంత్ర అభ్యర్థి – 3549 (0.30%)
షేక్ జిలానీ – స్వతంత్ర అభ్యర్థి – 2630 (0.22%)
నోటా – 711 (0.062%)
