దీక్ష విరమించిన కమలాపురం శాసనసభ్యుడు

రవీంద్రనాద్ రెడ్డి – కమలాపురం

దీక్ష విరమించిన కమలాపురం శాసనసభ్యుడు

కడప: వీరపనాయునిపల్లిలో గాలేరు నగరి ప్రాజక్టు పనులు పూర్తి చేయాలని కోరుతూ గత ఐదు రోజులుగా చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి గురువారం విరమించారు. భవిష్యత్తులో అసెంబ్లీ వేదికగా పోరాటాలు చేయాల్సి ఉన్నందున దీక్ష విరమించాలని అఖిలపక్ష నాయకులు ఆయనకు విజ్ఞప్తి చేశారు. తొలుత ససేమిరా అన్నా.. చివరకు వారి ఒత్తిడి మేరకు, భవిష్యత్తు పోరాటాల దృష్ట్యా దీక్ష విరమణకు ఎట్టకేలకు రవీంద్రనాథ్ రెడ్డి అంగీకరించారు.

దాంతో వైఎస్ వివేకానందారెడ్డ వైకాపా ఎమ్మెల్యేలు నిమ్మరసం ఇచ్చి ఆయనతో దీక్ష విరమింపజేశారు. రవీంద్రనాథ్రెడ్డి దీక్షపై ప్రభుత్వం స్పందించకపోవడంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు

చదవండి :  బాబును గద్దె దింపాలనే దుర్బుధ్ధితోనే...

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *