harinath

సీమ యువకుడికి కేంద్ర సాహిత్య అకాడమీ ‘యువ పురస్కారం’

అనంతపురం జిల్లాలోని గాండ్లపెంట మండలం – తాళ్ళకాల్వ గ్రామానికి చెందిన డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డికి 2014 సంవత్సరానికిగానూ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారంను పొందారు. సాహితీ రంగంలో విశేషంగా కృషి చేసిన 35ఏళ్లలోపున్న వారికి ఈ పురస్కారాన్ని అందిస్తారు. అప్పిరెడ్డి జ్ఞాపికతో పాటు 50 వేల రూపాయలను అందుకోనున్నారు. ఇంతకు ముందు కడప జిల్లాకు చెందిన వేంపల్లి గంగాధర్, వేంపల్లి షరీఫ్ లు కూడా  కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని అందుకున్నారు. వరుసగా రాయలసీమకు ముగ్గురు రచయితలు కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కారానికి ఎంపిక కావడం విశేషమే.!

హరినాథరెడ్డి రాసిన ‘సీమసాహితీ స్వరం – శ్రీ సాధన పత్రిక’కు అవార్డును ఎంపిక చేశారు. జెన్నె మాణిక్యమ్మ పబ్లికేషన్స్‌ వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. 1926వ సంవత్సరంలో పప్పూరు రామాచార్యుల సం పాదకత్వాన శ్రీ సాధన పత్రిక అనంతపురం కేంద్రంగా వెలువడింది. ఈ పత్రిక ఆధారంగా అందులోని సాహిత్యాంశాలను పరిశోధించి పుస్తకంగా ముద్రించారు. రాయలసీమ సాహిత్యంలో ఇప్పటి వరకూ వెలుగులోకి రాని ఎన్నో సాహిత్య విషయాలు ఈ పుస్తకం ద్వారా వెలుగులోకి వచ్చాయి. సాహిత్య విమర్శకుల నుంచి ఉత్తమ ప్రశంసలను ఈ పుస్తకం అందుకొంది.

చదవండి :  బాధ్యతలు స్వీకరించిన ఉపకులపతి

అప్పిరెడ్డి హరినాథరెడ్డి శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తీ చేసి, ద్రావిడ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డి పట్టాను పొందారు. కక్షలు నెలకొన్న దాదాపు 100 గ్రామాలను ప్రత్యక్ష పర్యటన చేసి, వాస్తవాలను పరిశీలించి, కక్షల విషయమై వెలువడిన కథసాహిత్యాన్ని కథకుల స్పందనలను తులనాత్మకంగా ఆధ్యయ నం చేశారు. ఉపాధ్యాయుడిగా వృత్తిబాధ్యతలు నిర్వహిస్తూనే, ఇప్పటి దాకా రాయలసీమ సాహిత్య, సాంస్కృతిక, సీమ సమకాలీన అంశాలపై ఆయన రచించిన వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. మాతృబాష పరిరక్షణ, వేమన బాషతత్వం, కులంపై గలమెత్తిన వాగ్గేయకారులు, సినిమాలలో సీమ సంస్కృతిపై విషప్రచారం, వేశ్యగృహాలలో నలిగిపోతున్న మహిళలపై వాడుతున్న మల్లెలను కాపాడలేరా.. అనే నివేదిక, సీమ స్థితిగతులపై శ్రీ కృష్ణ కమిటికి ఇచ్చిన కన్నీటి గాథల పెన్నేటి కథ అనే నివేదిక, చరిత్రకారుడిగా గురజాడ, రాయలసీమ దత్తపుత్రుడు ధామస్‌ మన్రో, కంపెనీ పాలకులపై రాయలసీమ వీరుల పోరాటం, శిల్ప కళాకృతుల కేంద్రం లేపాక్షి, సీమ సాహిత్యకారులారా స్పృహలో ఉన్నారా… సీమ విషాదమా… నవవాల్మీకులు, అనంతపురం జిల్లా బాషా తదితర అనేక వ్యాసాలు తదితర అనేక వ్యాసాలు రాసి తనదైన స్థానాన్ని హరినాథరెడ్డి పొందారు.

చదవండి :  కిడ్నాపైన కాంట్రాక్టర్ విడుదల

2004లో 17వ శాతాబ్దం నాటి గిరిజన భక్తుడు జగన్నాథ్‌సాథ్‌ సమాధిని, 2008లో గాండ్లపెం ట మండలంలోని తిరుమల దేవర కొండలలో ఆదిమానవుల కాలం నాటి నివాస గుహను కనుక్కొని, అందులోని 24 రేఖా చిత్రాలు గుర్తించారు. 2006 సంవత్సరంలో వేమన అధ్యయన అభివృద్ధి కేంద్రం స్థాపించి సాహిత్య, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ సాధన పత్రిక, కవితా సంకలన , శ్రీ కృష్ణదేవరాయ జయంత్యుత్సవ ఉపన్యాసాలు వ్యాసాలు తదితర పుస్తకాలను సంపాదకత్వం వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: